రూ. 19 వేల కోట్ల పెట్టుబడులు.. 12వేల వైద్య శిబిరాలతో ప్రజారోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష

– ఇవీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నవంబర్ నెల అభివృద్ధి సూచికలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవంబర్ నెలలో చేపట్టిన క్రీయాశీలక, వ్యూహాత్మక కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయి. అదేవిధంగా సీఎం జగన్‌ ఆధ్వర్యంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. నవంబరు నెలలో ప్రభుత్వం, వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమాల వివరాలు ఇలా…

సామాజిక సాధికార యాత్రకు అపూర్వ స్పందన
వైఎస్సార్‌సీపీ అణగారిన వర్గాల కోసం చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏ విధంగా మంచి జరిగింది అన్నది వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

Leave a Reply