Suryaa.co.in

Telangana

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు

– తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు బీజేపీ తరపున అభినందనలు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారు. బీఆరెస్ కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి డబ్బు మద్యం పంపిణి చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మరింత కఠినంగా వ్యవహారించాల్సింది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు ఆశిస్తున్నాం.

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు. పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణి జరిగింది.అయినా చూసి చూడనట్లే వ్యవహరించారు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొని, ఎన్నికల్లో ముందుకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.

సాగర్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈరోజు జరిగన ఘటనను ఖండిస్తున్నా..ఇది ఏమాత్రం మంచిది కాదు. దుందుడుకు విధానంతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు. ఏకపక్షంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్ నీళ్లు తరలించడం సరైన పద్దతి కాదు. ఇది వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్రతో కావాలనే చేశాయి. శాంతి భద్రత సమస్య రాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్న.

ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి. బీజేపీ కార్యకర్తలపై దాడులు, దొంగ ఓట్లతో అరాచకాలు సృష్టించాయి. దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టింది. అడ్డంకులు ఎదురైన బీజేపీ శ్రేణులు నిలవరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా..

LEAVE A RESPONSE