Suryaa.co.in

Telangana

బిఆర్ఎస్ బృందం పై కాంగ్రెస్ దాడి పిరికిపంద చర్య

– రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా చనిపోయిన వారి 25 లక్షలు,పంట నష్టం కు ఎకరాకు 30 వేలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలి
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో వరద బాధితుల పరామర్శకు వెళ్లిన వెళ్లిన మాజీ మంత్రి , శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు మరియు అందులో ప్రయాణిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ రవిచంద్ర కార్లపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేయడం పిరికిపంద చర్య అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ఈ దాడులకు బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకత్వం భయపడదు. కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తా ఉంటే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న మాకు న్యాయం చేయలేకపోయారు అని ప్రజలు ఛీకొడుతుంటే సి.ఎం నుండి మంత్రుల దాకా ఇంకా బిఆర్ఎస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

గత వరదల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకత్వం స్పందించిన తీరును అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటూ మీడియా సాక్షిగా చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.అందుకే క్షేత్ర స్థాయిలో వరద బాధితులను కలవడానికి వెళ్లిన మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీలపై దాడులు చేస్తున్నారు.

వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నాయి అని ముందుగానే హెచ్చరించారు. ఈ ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగాక మొసలి కన్నీరు కారుస్తూ బిఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.

వరద ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎదో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టుగా ప్రచార రథం మీద ఉండి చేతులు ఊపుకుంటూ ర్యాలీ లా వెళ్ళాడు కానీ అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలు విన్న పాపాన పోలేదు.

రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ లోని గొలుసుకట్టు చెరువులను మళ్ళీ పునరుద్ధరించాలని రాష్ట్రం ఏర్పడకముందే ప్రణాళికలు రచించి తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ పెరుతో చేరువులను పటిష్టము చేసిన ఘనత కేసీఆర్ ది అని అందుకే భారీ వర్షాలు కురిసిన చెరువులు తట్టుకున్నాయి అన్నారు..మిషన్ కాకతీయ చేపట్టకపోతే చేరువులన్ని తెగిపోయేవి.ఈ విషయం తెలంగాణ లో ఏ రైతునైన అడిగితే తెలుస్తుంది.

వరదల్లో చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు..నష్టపోయిన పంట నష్టంకు ముప్పై వేలు ఇస్తామని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం లోకి వచ్చాక ఎకరానికి పదివేలు, చనిపోయిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలిస్తామంటున్నారు.. ఇప్పటి కైనా వరద సాయం పెంచి చనిపోయిన వారికి 25 లక్షలు,పంట నష్టం కు ఎకరాకు 30 వేలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్న.

LEAVE A RESPONSE