Suryaa.co.in

Telangana

ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు?

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రభుత్వాలు చేస్తున్న “బుల్డోజర్ పాలిటిక్స్” ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్ తో జరుగుతున్న విధ్వంసం పై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ తో అన్యాయాలను కొనసాగిస్తుంటే ఆయనను ఆపలేని శక్తి హీనులుగా మారారా? లేదంటే ప్రజలను మోసం చేసే మీకు అలవాటైనా డబుల్ స్టాండర్ట్స్ విధానాలను ఇలా కొనసాగిస్తున్నారా? మీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.

LEAVE A RESPONSE