Suryaa.co.in

Telangana

వ్యాయామం ద్వారానే ఆరోగ్య వికాసం: పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : వ్యాయామం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అలవరచుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారసిగూడ లో కొత్తగా ఏర్పాటైన ‘హల్క్ జిమ్’ ను పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం సరసమైన ధరలకే జిమ్ లను నిర్వహించడం ద్వారా లాభాపేక్ష రహిత కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకుడు కిషోర్, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE