Suryaa.co.in

Telangana

రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకోకండి

– రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీలో సందర్శించిన హరీష్ రావు

హైదరాబాద్: రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి.బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తం.

ముఖ్యమంత్రి గారూ.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండి.

LEAVE A RESPONSE