Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు విరాళాలు

– మంత్రి లోకేష్‌ కు అందజేసిన ప్రముఖులు

ఉండవల్లి: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ని కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛందంగా ప్రజలు, దాతలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.1.63 కోట్లు, గుంటూరుకు చెందిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ ఎండీ, సెక్రటరీ కరస్పాండెంట్ భీమనాథం భరత్ రెడ్డి, శివ శిరీష రూ.10 లక్షలు, గుంటూరుకు చెందిన ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ రూ.లక్ష, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ రూ.50వేలు, విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(ఏపీపీయూఎస్ఎంఏ) ప్రతినిధులు రూ.10 లక్షలు, గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, విజయవాడకు చెందిన మొక్కపాటి సత్యనారాయణ రూ.2,42,764, కర్నూలుకు చెందిన పి.రాజశేఖర్ రూ.లక్ష, మంగళగిరికి చెందిన దివి పిచ్చేశ్వరరావు రూ.50 వేలు అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE