– ఆయనవి బ్రోకర్ మాటలు
– ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జైలుకు పోతారు జాగ్రత్త
– మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: అబద్ధాలు చెబితే నే ప్రజలు నమ్ముతారు అనే కల్చర్ ఉన్న వ్యక్తి రేవంత్. ఈ విషయం ఆయనే స్వయంగా అమెరికాలో చెప్పారు. అందుకే ఆయన హైడ్రా గురించి చెప్పిన మాటలు నమ్మలేకపోయా. నేను అనుకుందే నిజం అయ్యింది. పెద్దల పేరుచెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.
రేవంత్ శాడిస్ట్ ముఖ్యమంత్రి. ఇతరులు ఏడిస్తే నవ్వుకొనే వారు ఉంటారు. అలాంటి మనస్తత్వం ఉన్నట్టు ఉంది ఆయనకి. రేవంత్ రెడ్డి రజాకార్లకు వారసునిలా ఉన్నాడు. ఆయనవి బ్రోకర్ మాటలు, అబద్ధపు మాటలు. బాస్ ల మాటలు విని అడ్డగోలుగా వ్యవహరిస్తే అధికారులు జైళ్లకు పోకతప్పదు, తస్మాత్ జాగ్రత్త.
ప్రజలారా.. మీరు అనాథలు కారు. బీజేపీ మీకు అండగా ఉంటారు.
గగనపహాడ్ లో వాటర్ పాకెల్ట్లు అమ్ముకునే ఆమె ఆవేదన చూసాం.
కూకట్పల్లి నల్లచెరువులో లీజుకు తీసుకుని పెట్టుకున్న కాటరింగ్, ఫ్లెక్సీ ఫ్రింట్ షాపులను కూలగొట్టారు. అందులో ఉన్న మిషన్లు, సామాన్లు బయటపెట్టుకుంటం అని కాళ్ళమీద పడ్డా వినకుండా బూటు కాళ్లతో తన్ని పక్కన పడవేయడమే కాదు.. మిషన్లను డోజర్లతో తొక్కించి నాశనం చేసి శత్రువుల్లా వ్యవహరించారు.
మూసీ ప్రక్షాళన అంటే సంతోషపడ్డా.. కానీ, ఏం చేస్తారు. మీ ప్రణాళిక ఏంటి అంటే అధికారులు దగ్గర సమాధానం లేదు. మూసీ చుట్టూ ఉన్న పట్టా భూముల్లో ఎన్నో ఏళ్ళ కింద లే-అవుట్ లో కొనుక్కున్న భూములు,
కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ కింద ఉన్నాయని చైతన్యపురిలో నోటీసులు ఇచ్చారు.
ఆదమరిస్తే ఇళ్లు కూలగొట్టి మా శవాల మీద పేలాలు ఏరుకుంటారు.
జనప్రియ అపార్ట్మెంట్ ముప్పైళ్లకింద కట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం తీసుకోండి, లేకపోతే అది కూడా దక్కదు అని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇల్లు పోగొట్టుకొని ఊరుబయటికి పోయి ఉంటే వారికి ఉపాధి ఎలా అని అడుగుతున్న.
అధికారులారా ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నా.. బాస్ ల మాటలు విని పనిచేసిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోతారు జాగ్రత్త. పిలిస్తే పలికే బిడ్డలా ఉంటా అని చెప్పిన. మీకు కష్టం ఉంది అనగానే మీ దగ్గరికి వచ్చిన. మీకు అండగా ఉంటా.
మీ డ్రామాలు ఆపి.. మూసీ ఏం చేయాలి అనుకుంటున్నావు, ప్రజలను ఏం చేయాలి అనుకుంటున్నావు చెప్పి చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోం. అనేక హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. బ్రోకర్ మాటలు, అబద్ధపు మాటలు చెప్పారు.
క్రాప్ లోన్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, సీఎం అవ్వగానే రుణమాఫీ చేస్తా అన్నారు. ఒక్క హామీకూడ నెరవేర్చలేదు. రెక్కల కష్టం నమ్ముకుని బ్రతుకుతున్న వారి జీవితాలను ఛిద్రం చేయవద్దు.
దవాఖానలో మందులు లేవు, పని చేసిన వారికి బిల్లులు లేవు, జీతాలకు డబ్బులు లేవు కానీ లక్ష 50 వేల కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తా అంటే ఎలా నమ్మాలి. కమీషన్ల కోసమే ఇదంతా తప్ప చిత్తశుద్ధి లేదు.
మూసీ ప్రక్షాళన పేరుతో పేదోళ్ల భూములు లాక్కొని పెద్దోళ్ళకి ఇచ్చి మాల్స్ కట్టి రంగుల ప్రపంచం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనాథలు కారు. బీజేపీ అంతా అండగా ఉంటారు. మూసీకి అటుపక్క కిషన్ రెడ్డి , ఇటుపక్క నేను ఉన్న, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి నలుగురు ఎంపీలున్నాం. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారు.
కాసేపు కూర్చొని, ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోవడానికి రాలేదు. పేదల కన్నీళ్లకు పరిష్కారం చెప్పడానికి వచ్చాను. 25 ఏళ్లుగా చాలా మంది సీఎంలను చూసాను, చాలా ప్రభుత్వాలతో కొట్లాడాను. నా బ్రతుకంతా కొట్లాడడమే. ధర్మంకోసం, న్యాయంకోసం కొట్లాడుతూనే ఉంటా. పేదల న్యాయం కోసం మీకు అండగా ఉంటా.
ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మన ఓటు కోసం మళ్లీ వస్తారు. వదిలిపెడతామా. బొందపెడతాం. మీకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది.