Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి వైసీపీ సమన్వయకర్త దొంతి రెడ్డితో జోగి రమేష్ భేటీ

– న్యాయపరమైన అంశాలపై లీగల్ సెల్ న్యాయవాదుల చర్చ

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు లోని మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డిని, మాజీ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ని కలిసారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టిడిపి పార్టీ పెడుతున్న అక్రమ కేసులు గురించి చర్చించారు. పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగదు అన్నారు. వారిపై అక్రమ కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని. కొన్ని రోజులు ఓపిక పడితే చాలని ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ న్యాయవాదులు పార్టీ కార్యకర్తలు, నాయకులు కోసం కోర్టులో పోరాడే వారు ఉన్నారని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

LEAVE A RESPONSE