Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణ కార్పొరేషన్ సత్రంపై మంత్రి సవిత సమీక్ష

-గుంటూరు కొత్తపేటలో ఉన్న యడవల్లి వారి బ్రాహ్మణ సత్రం సందర్శించిన మంత్రి సవిత
-బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నేతలతో, అధికారులతో సమీక్ష
-బ్రాహ్మణ కుటుంబాలు లకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది

బ్రాహ్మణ సత్రంకి ఉన్న 3ఎకరాల స్థలాన్ని పరిశీలించి రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తాం, యడవల్లి వారి బ్రాహ్మణ సత్రం ఆస్తులపై గతంలో అన్యాక్రాంతం కావడం, కోర్టు కేసులు, మున్సిపల్ కార్పొరేషన్ బకాయిలుపై అధికారులతో సమావేశం జరిగింది.. జిఎంసి, బ్రాహ్మణ కార్పొరేషన్ వివాదం పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఫోన్లో ఆదేశించారు.

రాష్ట్రంలో 5సం. లు నవరత్నాల పేరుతో దోచుకువడం, దాచుకోవటమే ధ్యేయంగా పనిచేసింది
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చేశారని, గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా మోసం చేశాడని, బ్రాహ్మణ అర్చకులపై దాడులు జరిగిన కూడా పట్టించుకోలేదని, అర్చకులు సమస్యలు పరిష్కరించకుండా అలానే తత్సర్యం చేశారని చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వం రాగానే అర్చకులకు వేతనం 15,000 రూ.లు పెంచడంతోపాటు, ధూప దీప నైవేద్యాల పథకం కింద 10,000 రూ.లు ఇవ్వటం ప్రారంభించారని, ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పిస్తున్నారని, బ్రాహ్మణులు కోల్పోయిన పూర్వవైభవాన్ని మరల చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించారని దానిలోని భాగంగానే యడవల్లి వారి బ్రాహ్మణ సత్రాన్ని అభివృద్ధి చేయడం, బ్రాహ్మణ సంక్షేమానికి వినియోగించడం మరియు న్యాయపరమైన వివాదాలు పరిష్కరించడం కోసం సమీక్ష సమావేశం నిర్వహించామని మంత్రి సవిత పేర్కొన్నారు.

మంత్రి పర్యటనలో పాల్గొన్న సత్రం కన్వీనర్ & ఈవో సుభద్ర, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ, తదితర కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE