Suryaa.co.in

Andhra Pradesh

నేను సిద్ధం… మరి మీరు?

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి నేను సిద్ధం.. మరి మీరు సిద్ధమా..? పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేయించుకుని ఓటు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని మరువద్దు అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఓటు నమోదుకు సమయం ఉంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఈరోజే ఫారం 18 పూర్తి చేసి ఓటరుగా నమోదవ్వండి. నేను పట్టభద్ర ఓటరుగా నమోదుకు ఫామ్- 18 సమర్పించాను. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని పట్టబద్రులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకుని చైతన్యం చాటుదామని ఆయన పేర్కొన్నారు.

LEAVE A RESPONSE