Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ప్రాజెక్ట్ కు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజలు సహించరు

  • రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్రంతో పోరాడాలి…
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ 

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం తో లాలూచీపడిన రాష్ట్రం ప్రజలు సహించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో పోలవరం నిర్వహితులు కొండలు గుట్టల పైన నివాసముంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమైనదో పోలవరం నిర్వహితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతింటాయన్నారు. ఈ విషయంపై విశాఖపట్నంలో రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇరిగేషన్ నిపులను ఆహ్వానించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధికి ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అప్పుగా వరల్డ్ బ్యాంకు నుంచి 15 వేల కోట్లు, హడ్కో లో 11 కోట్లు తీసుకొని కట్టుకోమని చెప్తున్నారు అన్నారు. 196 టీఎంసీల నీటి నిల్వ ఉండాలంటే 45.72 మీటర్ల ఎత్తు ఉంటే 960 మెగావాట్ల విద్యుత్తు తయారవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఎత్తు కాకుండా 41.15 మీటర్లో కుదిస్తామని చెప్పడం చూస్తుంటే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్యాయాన్ని ఎండగట్టాలన్నారు. విద్యుత్ చార్జీల విషయంలో ప్రజలపై 6 వేల 70 కోట్ల భారం పడుతోందన్నారు. రాబోవు కాలంలో 12 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయాల పైన నవంబర్ 7వ తేదీన విశాఖపట్నంలో వామపక్ష సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

అనంతపూర్ జిల్లాలో 31 మండలాలకు గాను ఏడు మండలాలకు కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఈ విషయంపై టిడిపి నాయకులు నోరు తెరవాలి అన్నారు. టిడిపి గెలుపుకు రైతులు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. కరువు మండలాలు గుర్తించడంలోనూ, పంట నష్టం, అన్నదాత సుఖీభవ, రైతు బంధు, పంటల ఇన్సూరెన్స్ విషయంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయాలపై నవంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రిని, ఇరిగేషన్ మంత్రులను కలవడం జరుగుతుందన్నారు.

రాయలసీమ జిల్లాలో ఎక్కడైతే కరువు ప్రాంతాలను గుర్తించి మరో మారు రివ్యూ చేసి ప్రకటించాలని ఈరోజు రెవెన్యూ మంత్రి అన్నగారి సత్యప్రసాద్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. జగదీష్, అనంత జిల్లా కార్యదర్శి సి జాఫర్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్, అనంత జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE