– క్యాడర్‌ను మెప్పించిన నామినేటెడ్ జాబితా
– తొలి జాబితాపై పెదవి విరుపు
– టీటీడీ బోర్డుపైనా అదే అసంతృప్తి
– రెండో జాబితాలో పనిచేసిన వారికి పట్టం
– ఊహించని వారికి సైతం పదవులు
టీడీపీకి 48, జనసేనకు 9, బీజేపీకి రెండు పదవులు
– ఇది బాబు మార్కు ఎంపిక అంటూ కితాబు
(మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి అధికారంలోకి వచ్చిన ఐదునెలల తర్వాత ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండవ జాబితా, కూటమి శ్రేణులను పూర్తి స్థాయిలో మెప్పించింది. ఇది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మార్కు ఎంపిక అని, ఎవరి ఒత్తిళ్లు లేకపోతే బాబు మార్కు ఎంపిక అంత అద్భుతంగా ఉంటుందో చెప్పేందుకు ఇది మరో నిదర్శనమన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.టీడీపీకి 48 పదవులు, జనసేనకు 9 పదవులు , బీజేపీకి రెండు పదవులు దక్కాయి.
59 మందితో శనివారం కూటమి ప్రకటించిన నామినేటెడ్ పదవులు మూడు పార్టీ శ్రేణులను మెప్పించాయి. ఇది పూర్తిగా పార్టీ పల్లకీ మోసిన వారికి కట్టిన పట్టంగా శ్రేణులు అభివర్ణిస్తున్నారు. తొలి జాబితాలో స్థానం లభించని సీనియర్లకు, రెండో జాబితాలో స్థానం కల్పించినట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ సర్కారుపై శివాలెత్తిన కొమ్మారెడ్డి పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి, కావలి గ్రీష్మ, జీవీరెడ్డి, నీలాయపాలెం విజయ్‌కుమార్, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ మోహన్‌కృష్ణ, డేగల ప్రభాకర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, తేజస్వి వంటి నేతలతోపాటు.. పార్టీని అంటిపెట్టుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, ఏ పార్టీతో సంబంధం లేని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ప్రభుత్వ సలహదారు పదవులివ్వడం శ్రేణులను మెప్పించింది.
ఇక పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రావి వెంకటేశ్వరరావు, కిడారి శ్రవణ్, డూండీ రాకేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసింహయాదవ్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ కు నామినేటెడ్ పదవులివ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టికెట్ రాక నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, రావి వెంకటేశ్వరరావుకు ఈసారి న్యాయం జరిగింది.
తొలి జాబితా..ఆ తర్వాత విడుదలైన టీటీడీ పదవులపై అసంతృప్తి, పెదవి విరుపు వ్యక్తమయింది. ఆ రెండూ ‘వివిధ కోటా’ల ఖాతాలో వెళ్లాయన్న విమర్శలు వినిపించాయి. టీటీడీ బోర్డు అయితే పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని, కార్యకర్తలు గుర్తించని వారికి పదవులిచ్చారని, విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ నాయకత్వం.. తన రెండో జాబితాలో దిద్దుబాటుకు దిగి, శ్రేణులు మెచ్చే వారిని ఎంపిక చేసి, వారి పెదవులపై చిరునవ్వులు పూయించింది.
అయితే వీటికి డైరక్టర్ల ఎంపిక ఇంకెంత కాలం పడుతుందోనన్న క్యాడర్ నిరాశాపూరిత వ్యాఖ్యలకు, నాయకత్వం త్వరగా తెరదించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని వందల పదవులున్న నేపథ్యంలో. వాటిపై కసరత్తు చేసేలోగా.. ప్రస్తుతం వేసిన బోర్డు, కార్పొరేషన్లకు డైరక్టర్లను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తే దాదాపు 500 మందికి పైగా స్థానం కల్పించవచ్చంటున్నారు. గత కొంత కాలం నుంచి సీఎం-పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కార్యకర్తలు-నాయకుల నుంచి తీసుకుంటున్న దరఖాస్తులను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
వివిధ పదవుల కోసం దరఖాస్తు చే సుకున్న వేలాదిమంది కార్యకర్తలు-నేతలకు సైతం, వారి స్థాయిలో పదవులు ఇవ్వాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరి ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇంకా పదవులు రాని-గత ఎన్నికల్లో టికెట్లు రాని నేతలు, వివిధ రూపాల్లో పార్టీకి సేవలందించిన వారికి, రాష్ట్ర స్థాయి సీనియర్లు, విపక్షంలో జిల్లా పార్టీలను మోసిన నాయకులకు పదవులు ఇవ్వలేదు.
నామినేటెడ్ పదవుల జాబితా ఇదే
1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి )
2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వరరావు
3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి)
4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర ( అనకాపల్లి – టిడిపి )
5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టిడిపి )
6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల – టిడిపి )
7. ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని – టిడిపి )
8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ ( తిరుపతి – టిడిపి )
9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )
11. ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టిడిపి )
12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)
13. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి – టిడిపి )
14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)
15. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టిడిపి )
16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి – టిడిపి)
17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటచింతల – ( మాచర్ల – టిడిపి)
18. ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి )
19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి ( మార్కాపురం – టిడిపి )
20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టీడీపీ )
21. ఏపీ కల్చరల్ కమిషన్ – తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టిడిపి)
22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి )
23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టిడిపి )
24. ఏపీ గ్రంధాలయ పరిషత్ – గోనుగుంట్ల కోటేశ్వరరావు ( నరసరావుపేట – టిడిపి )
25. ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి )
26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టిడిపి )
27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టిడిపి )
29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి )
30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )
31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టిడిపి )
32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టిడిపి )
33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వరరావు ( గుడివాడ – టిడిపి )
34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావలి గ్రీష్మ ( రాజాం – టిడిపి )
35. ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ )
36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలత ( చీరాల – టిడిపి )
37 . ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టిడిపి )
38. ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టిడిపి )
39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి )
40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టిడిపి )
41. అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ – అనంతపూర్ – జనసేన )
42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి )
43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టిడిపి )
44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టిడిపి )
45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత ( చిత్తూరు – టిడిపి )
46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన )
47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టిడిపి )
48. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ )
49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )
50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బొడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )
51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )
52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి )
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి)
55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )
56. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)
57. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి )
58. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )
59. ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టిడిపి )