– జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ముందంజ
– 81 స్థానాలకు గాను 49 స్థానాల్లో ముందంజ
– ఫలించిన భట్టి విక్రమార్క కృషి
– ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపైనర్ గా తీవ్రంగా శ్రమించిన భట్టి
– ఝార్ఖండ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు
– రాజ్యాంగ పరిరక్షణ.. స్థానిక మైనింగ్, ఇతర వనరులు స్థానికులకే దక్కాలి అన్న రెండు అంశాలు ప్రధానంగా భట్టి విస్తృత ప్రచారం.. అవే గెలుపుకు పునాదులు
హైదరాబాద్: పట్టు వదలని విక్రమార్కుడు భట్టి.. 40 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయం, 20 ఏళ్ల పైబడి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ ప్రయాణం. ఎక్కడ, ఎప్పుడు ఓటమి ఎరగని ధీరత్వం. కాంగ్రెస్ భావజాలాన్ని నూటికి నూరు శాతం పనికి పుచ్చుకున్న వారు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, ఆచితూచి వ్యవహరించే శైలి, ఉన్నత విద్యావంతుడు, బహుభాషా ప్రవీణుడు, అన్నిటికీ మించి అధిష్టానంపై అచంచల విశ్వాసం.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భట్టి విక్రమార్కను జార్ఖండ్ ఎన్నికల సీనియర్ పరిశీలకునిగా, స్టార్ క్యాంపెనర్ గా, ఫలితాల ముందు రోజు అబ్జర్వర్ గా నియమించింది. అధిష్టానం బాధ్యతలు అప్పగించడమే తరువాయి డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలో ఉన్న వెను వెంటనే ఝార్ఖండ్ కు బయలుదేరారు. మొదటి దశలో Jmm, కాంగ్రెస్, rjd, మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు లో కీలక భూమిక పోషించారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచార వివాహాన్ని ఖరారు చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత జార్ఖండ్ పిసిసి స్తృతస్థాయి సమావేశం, సీనియర్ నేతలు అందరినీ సమావేశపరిచి ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి బోధ చేశారు.. ఎఐ సి సి జనరల్ సెక్రెటరీ కే సి వేణుగోపాల్, డిప్యూటీ సీఎం భట్టి ఇతర నాయకులు కలిసి మేనిఫెస్టో రూపొందించారు.
ఆ తర్వాత రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచార షెడ్యూల్, ప్రచారంలో పాల్గొనవలసిన ఇండియా కూటమి నేతల జాబితా ఖరారు వంటి పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత విస్తృత ప్రచారం చేపట్టారు.. భారీ బహిరంగ సభల కన్నా బ్లాక్ స్థాయి సభలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇంటింటికి మేనిఫెస్టో .. ఏడు గ్యారంటీలు , మీడియా ప్రాధాన్యత అంటే అంశాలపై ఎక్కడికి అక్కడ నాయకులకు శిక్షణ ఇచ్చారు. ఓవైపు సభలు నిర్వహిస్తూ మరోవైపు ఇండియా కూటమి నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులను.. అభ్యర్థిని సమన్వయపరిచారు. మూడు దశల్లో సుమారు పది రోజులపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్ లో పర్యటించారు. రాంచి కేంద్రంగా మకాం వేసి తెరవెనక యంత్రాంగం నడిపిస్తూ.. మరోవైపు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఫలించిన భట్టి ప్రచార ఎత్తుగడ
జార్ఖండ్ రాష్ట్రంలో అంతరాలు తొలగిపోవాలంటే, అందరికీ సమాన హక్కులు కావాలంటే. రాజ్యాంగ పరిరక్షణ ఏకత మార్గం ఇందుకు ఇండియా కూటమి విజయం సాధించి తీరాల్సిందేనని..
మరోవైపు జార్ఖండ్లోని అపారమైన ఖనిజ సంపదపై బిజెపి కన్ను పడింది దీనిని అదాని, అంబానీ వంటి క్రొనీ క్యాపిటల్ లిస్ట్ ల చేతిలో పెట్టేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని వివరించారు. ఇది రాష్ట్ర ఖనిజ వనరులు, సంపద ఝార్ఖండ్ వాసులకు దక్కాలంటే కాంగ్రెస్ కూటమి ని గెలిపించాలంటూ కచ్చితంగా ప్రచారం చేశారు. ఈ రెండు అంశాలు స్థానికులను ఆలోచింపజేశాయి ఫలితంగా ఇండియా కూటమి గెలుపు దిశగా పయనిస్తోంది.