Suryaa.co.in

Andhra Pradesh

సనాతన ధర్మాన్ని మంటగలిపే ఎవరినైనా ఉపేక్షించం

  • శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ధ్వంసం చేసిన నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి…
  • గత ప్రభుత్వంలో మాదిరి దేవుళ్లపై దాడులు జరుగుతుంటే పోలీస్ శాఖ నిద్రపోతుందా….

అమరావతి: గుంటూరు నగరంలో అపార్ట్మెంట్లో కొలువున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన నేరస్తులను తక్షణమే అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ… గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ లో ఉన్న శ్రీ వెంకటేశం అపార్ట్మెంట్లో వాసులందరూ కలిసి సెల్లార్ పార్కింగ్ లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అపార్ట్మెంట్ ప్రారంభంలో ఏర్పాటు చేసుకున్నారు. స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారని, అయితే అపార్ట్మెంట్లో ఉండే ఒక అన్యమత కుటుంబం, మరియు ఇద్దరు వ్యాపారస్తుల కుటుంబాల యజమానులు నేటి ఉదయం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను కసితీరా ధ్వంసం చేశారు.

అపార్ట్మెంట్లో ఉండే అన్య మతస్థుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాజీ డిఈ కేమో శ్రీ వెంకటేశ్వర స్వామి నచ్చడు. అదే అన్య మతస్థుడు హిందువులు ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని మరి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని, అతను కొనుక్కున్న రోజుకే వెంకటేశ్వర స్వామి ప్రతిమ అపార్ట్మెంట్లో ఉందని, అతనితోపాటు చింతపండు వ్యాపారం చేసే వ్యాపారస్తుడు, ప్రత్తి జిన్నింగ్ వ్యాపారస్తుడకేమో తమ తమ వ్యాపారంలో నష్టాలు వచ్చినాయని అన్యమతస్తుడితో కలిసి 6 అడుగుల దేవుడి ప్రతిమను తెల్లవారుజామున ధ్వంసం చేశారు.

అదే అపార్టుమెంటులో 20 మంది కి ఫ్లాట్స్ వున్నాయి, వారికి వ్యాపారాలు ఉన్నాయి. మిగిలిన వారికి రాని నష్టాలు ఈ ముగ్గురికి వచ్చాయని ధ్వంసం చేశారు. స్థానిక అపార్ట్మెంట్ వాసులు అడ్డుకుంటున్న సరే వారిపై కూడా దాడికి దిగారు. ఈ తంతు స్థానికంగా సీసీ ఫుటేజ్ రికార్డు కూడా అయివుందని, ఇది ఈ దుశ్చర్య సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిందని, ఈ దుశ్చర్యకు పాల్పడిన నేరస్తులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తక్షణమే అరెస్ట్ చేయాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా , ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, అందువల్ల నేరస్థులు ఎంతటి వారైనా సరే వారిపై తక్షణమే పోలీస్ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

ఇటువంటి నేరస్థుల వల్ల సనాతన ధర్మంకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, సనాతన ధర్మాన్ని ఎవరు అపహాస్యం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో వురుకునే ప్రసక్తే లేదని, తగు రీతులో తాము బుద్ధి చెప్తామని శ్రీధర్ హెచ్చరించారు సనాతన ధర్మంలో ఈ దేశంలో హిందూ మతం తో పాటు మిగిలిన మతాలను కూడా గౌరవించే సాంప్రదాయం, సంస్కృతి ఉందని దాన్ని కొంతమంది మూఢ మతస్తులు ఈ విధంగా అవమానిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, హిందూ దేవి దేవుళ్ళు ఉన్న ప్రాంతాల్లో అన్య మతస్తులు నివాసం ఉంటే ఆయా మిగిలిన మతాల దేవుళ్లను కూడా గౌరవించడం నేర్చుకోవాలనీ, అలా లేని పక్షంలో ఆ ప్రాంతాల్లో వారు నివాసం ఉండకుండా తమ మతస్థులు అధికంగా ఉన్న ప్రాంతంలో ఉంటే ఇటువంటి వివాదాలు, శాంతి భద్రతల సమస్య ఉండవని, దేశంలో అందరూ పరమత సహనం కలిగి ఉంటే అసలు మతాల మధ్య గొడవలే రావని, కొంతమంది నీచులు వారి మతాల్లో గొప్పవాళ్ళు అనిపించుకోవాలని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, వీరిని ఏ మతంలో ఉన్న దేవుడైనా సరే క్షమించడని తగురీతిలో శిక్ష విధిస్తాడని శ్రీధర్ తెలియజేశారు.

గత జగన్ ప్రభుత్వంలో కూడా ఇలానే దేవుళ్ళపై, అర్చకులపై దాడులు జరుగుతుంటే పోలీస్ శాఖ కనీసం కూడా చట్ట ప్రకారం పట్టించుకోలేదని, మరలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి దాడులకు తెరలేపుతూ ఉంటే పోలీస్ శాఖ కళ్ళప్పగించి నిద్ర పోతుందా అని శ్రీధర్ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఇటువంటి దాడులు వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే ప్రమాదం ఉందని శ్రీధర్ హెచ్చరించారు. తక్షణమే పోలీస్ శాఖ అధికారులు ఇటువంటి నేరాలు దాడులు జరగకుండా తక్షణమే అడ్డుకట్ట వేయాలని శ్రీధర్ పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, పెద్దింటి చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాదు, వావిలాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE