– యాసంగిలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల.
హైదరాబాద్: వ్యవసాయ, చేనేత అనుబంధ కార్పోరేషన్ల ఎండీలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతన్న, నేతన్నల సంక్షేమం దిశగా వివిధ కార్పోరేషన్లు చేపట్టిన కార్యక్రమాలను మంత్రి కి అధికారులు తెలిపారు.
ప్రతి కార్పొరేషన్ దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వ్యాపార దృక్పదంతో పని చేయాలని, కార్పోరేషన్ల ఆర్థిక పరిపుష్టితో పాటు, కార్యక్రమాల విస్తరణకు మంత్రి దిశానిర్ధేశం చేయడం జరిగింది.
ఉద్యాన శాఖ ద్వారా హైదరాబాద్ కు 100 కిలోమీటర్ ల పరిదిలో అన్నీ జిల్లాలలో సరిపడా వివిధ రకాల కూరగాయలు పండించుటకు మరియు వాటి మార్కెటింగ్ కు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
గిడ్డంకుల శాఖ పరిదిలో ఉన్న అన్నీ గోడౌన్లు ఖాళీ లేకుండా పూర్తి స్థాయిలో వినియోగంలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. గోడౌన్ల రిపేర్ లు మరియు మరమత్తుల విషయంలో అలసత్వం వహించరాదన్నారు. గోడౌన్ల పైకప్పు పై సోలార్ పవర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అంతేగాక గిడ్డంగులు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అందుబాటులోకి తేవాల్సిఉందని, గిడ్డంగులను ఆధునికరించడంతో పాటు, కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
గిడ్డంగుల కెపాసిటీ పెంపు కోసం, ప్రైమ్ లోకలిటీస్ లో కమర్షియల్ యూసెజ్ కోసం మరియు తగ్గిన ప్రణాళికలు సిద్దం చేయాలని సోలార్ పవర్ పానెల్ ఏర్పాటు కోసం తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి సూచించారు. మార్క్ ఫెడ్ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాములతో కల్పి ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే, అన్ని గోదాములను సమర్థవంతముగా వినియోగించడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గి, ఆర్థికభారం తగ్గె వెసులుబాటు వస్తుందని మంత్రి తెలిపారు.
యాసంగి సీజన్లో ఎరువుల సరఫరా మానిటరింగ్ మరింత సమర్థవంతంగా, లోపాలు లేకుండా తగిన ప్రణాళిక చేయాలని, అంతేగాక రాబోయే సీజన్ లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోళ్లు కోసం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం తరఫున రైతుల వద్ద మద్ధతు ధరకు సేకరించిన జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, కంది ఇతరత్ర పంటలకు ఎక్కడైతే అధిక ధరలు వస్తాయో అక్కడ అమ్మే విధంగా HACA ప్రతినిధులతో కలిసి పని చేయాలని మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి సూచించారు.
వ్యవసాయ దారులకు అవసరమున్న యంత్ర పరికరాలను అందించేందుకు బ్యాంకర్లు మరియు కంపెనీల సహకారంతో ప్రతి జిల్లాలలో వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ఆగ్రోస్ ఏం.డి ని ఆదేశించారు. రైతులకు ఎక్కువ ఉపయోగపడే మంచి కంపెనీల పరికరాలను ప్రదర్శనలో ఉంచాలని మరియు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలను పునరుజ్జీవం చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఎండి ని ఆదేశించారు.
టెస్కో ద్వారా వివిధ రకాల అమ్మకాలు పెంచేందుకు ప్రణాళిక బద్దంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎం.డీ టెస్కో కి సూచించారు. నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు ఎప్పటికప్పుడు వర్క్ ఆర్డర్ లు అందించాలని మంత్రి ఆదేశించారు. యారన్. Depo ద్వారా 90 శాతం క్రెడిట్ పద్దతిన నేత కార్మికులకు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారము సకాలంలో నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి నేత కార్మికునికి నిరంతరం పని కల్పించేందుకు తగిన ప్రణాళిక సిద్దం చేయాలని అదేశించారు.
రాష్ట్రంలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుటకు ప్రణాళిక బద్దంగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశించారు. HACA పరిధి దృష్ట్యా కొత్త ప్రణాళికలతో, కొత్త రంగాలలో వ్యాపారభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. కో ఆపరేటివ్ యూనియన్ కు సంబంధించి శిక్షణా తరగతుల నిడివిని పెంచాల్సిందిగా, అదేవిధంగా కో ఆపరేటీవ్ సిబ్బంది పనితీరు మెరుగుపడేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మంత్రి అదేశించారు.
ఈ సమావేశంలో సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, గిడ్డంగుల సంస్థ, ఎండీ లక్ష్మీ, HACA ఎండి చంద్రశేఖర్ రెడ్డి, ఐ.ఎ.ఎస్, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోపరేటివ్ యూనియన్ ఎండి అన్నపూర్ణ, ఆగ్రోస్ ఎం. డి శ్రీ రాములు, హౌజింగ్ ఫెడ్ ఎండి పూర్ణచందర్, సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ఎండి కేశవులు తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.