– రాష్ట్ర అభ్యున్నతికి చంద్రబాబు కష్టపడుతున్నారు
– జగన్ ఉంటే… ఇంట్లో చెదలు, వ్యవసాయంలో పరుగులు ఉన్నట్లే
– ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి: ప్రభుత్వాలు మారినా… తరాలు మారినా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారనవి నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మాత్రమే అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం పార్వతీపురంలో మంగళవారం నాడు, తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్నిమంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. నాడు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ కృషి చేస్తే… నేడు తెలుగు వారి అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్ట పడుతున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. తెలుగు ప్రజల తలసరి ఆదాయం పెంచే దిశంగా సీఎం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
చంద్రబాబు విజన్ 2020తోనే గ్రామాల్లోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పుట్టుకొచ్చారని మంత్రి గుర్తు చేశారు. విజన్ 2047పై జగన్ చేస్తున్న విమర్శలకు ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు. గడిచిన 43 సంవత్సరాలుగా టీడీపీని నాశనం చేయాలని ఎందరో, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అన్ని ఆటుపోట్లకు ఎదురొడ్డి టీడీపీ నిలబడిందని వ్యాఖ్యానించారు. టీడీపీ సిద్ధంతాలు ఎప్పటికీ బతికే ఉంటాయని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా తెలిపారు.
వేల ఎకరాలు త్యాగం చేసిన వారిని…
33 వేల ఎకరాలను త్యాగం చేసిన రాజధాని మహిళలను జగన్ మీడియా, జగన్ పార్టీ అనరాని మాటలు అందని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పార్టీ సమాజంలో ఉంటే ఇంట్లో చదలు పట్టినట్లే అని చెప్పారు. వ్యవసాయానికి పురుగు పడితే ఎంత నష్టమో… జగన్ వల్ల ఈ రాష్ట్రానికి కూడా అంతే నష్టం జరుగుతుందని వివరించారు. మహిళలను గౌరవించడం కూడా తెలియని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో.., ప్రజలు ఎంత నష్ట పోయారో అందరూ చూశారన్నారు. కూటమి ప్రభుత్వంలో కుల, మతాలకు అతీతంగా అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని గొట్టిపాటి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ప్రజలందరూ అభివృద్ధి కావాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు.
కడప మహానాడు విజయవంతం కావడమే టీడీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా తెలుగు ప్రజలు భూమిపై ఉన్నంత కాలం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు.
బాలకృష్ణ వేడుకల్లో…
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తరువాత బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఆయన.., అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. అనంతరరం స్థానిక రైతుకు వ్యవసాయంలో ఉపయోగపడే డ్రోన్ ను మంత్రి గొట్టిపాటి చేతుల మీదుగా అందజేశారు.