ఆనంద్ రంగనాథన్ సంధించిన 9 ప్రశ్నలు
రెండు నెలల క్రితం, బీజేపీ ఎంపీ డా. నిశికాంత్ దూబే ఓ పెద్ద బాంబు పేల్చారు.
“ఈ దేశంలో గనుక ధర్మయుద్ధమే మొదలైతే, దానికి సుప్రీంకోర్టు, దాని న్యాయమూర్తులే కారకులవుతారు!” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో నిప్పు రాజేశాయి.
నలుగురూ ఆయనపై దుమ్మెత్తిపోశారు, విపక్షాలైతే కత్తులు నూరాయి. కానీ, కథ అక్కడితో ఆగలేదు!
ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత, వక్త ఆనంద్ రంగనాథన్ రంగంలోకి దిగి, దూబేగారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన విడుదల చేసిన వీడియో, అప్పటికే మండుతున్న మంటల్లో నూనె పోసినట్లైంది.
రెండు నెలలు గడిచినా, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన ఎందుకంటే… రంగనాథన్ లేవనెత్తిన ప్రశ్నలు మామూలువి కావు. అవి సామాన్యుడి గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన ప్రశ్నలు. వాటిని వింటే మీకే ఆ విషయం ఠక్కున అర్థమవుతుంది!
ఆనంద్ రంగనాథన్, తన గంభీరమైన ఆంగ్లంలో సుప్రీంకోర్టును తొమ్మిది గుండెలు పిండే ప్రశ్నలు అడిగారు. అవి కేవలం ప్రశ్నలు కావు, హిందూ సమాజం గుండెల్లోంచి రగులుతున్న అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న నిప్పుకణికలు!
ఆనంద్ రంగనాథన్ సంధించిన తొమ్మిది ప్రశ్నల బాణాలు:
1. కశ్మీర్ విషయంలో ద్వంద్వ నీతి ఎందుకు?
మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేయగానే, సుప్రీంకోర్టు ప్రతిపక్షాల పిటిషన్లపై క్షణాల మీద ప్రత్యేక ధర్మాసనం వేసి విచారణ చేపట్టింది. అది సరే!
కానీ, 1990లో కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని (బలవంతంగా పంపేయడం, ఇళ్లు లాక్కోవడం, దేవాలయాలు కూల్చడం, హత్యలు, అత్యాచారాలు, ఉద్యోగాల నుంచి తీసేయడం) అడ్డుకోవడానికి దాఖలైన పిటిషన్లను “అది జరిగి చాలా కాలమైంది, ఇప్పుడు మళ్ళీ తవ్వలేము” అంటూ కొట్టిపారేసింది!
ఇది ద్వంద్వ ప్రమాణం కాదా?
ఇది హిందువుల మనసుల్లో ఆగ్రహం నింపదా?
ఇది ధర్మయుద్ధాన్ని రగిల్చడం కాదా?
2. వక్ఫ్ బోర్డుల ఆక్రమణలపై మౌనం ఎందుకు?
నేడు సుప్రీంకోర్టుకు వక్ఫ్ బోర్డుల గురించి అకస్మాత్తుగా చింత పట్టుకుంది. కానీ గత 30 ఏళ్లుగా వక్ఫ్ బోర్డులు అక్రమంగా ఆక్రమించుకున్న భూములు, సమాంతర న్యాయ వ్యవస్థలు, పన్నులు ఎగవేయడం – ఇవేవీ కోర్టు కంటికి కనిపించలేదా?
నేడు వక్ఫ్ చట్టం సంస్కరణ ఇస్లాంకు ప్రమాదం అనిపిస్తే, హిందువుల భూములపై మసీదులు, సమాధులు కట్టడం మాత్రం న్యాయమేనా?
గత పదేళ్ళలో వక్ఫ్ బోర్డులు 20 లక్షల హిందూ ఆస్తులను కబ్జా చేస్తే, సుప్రీంకోర్టు నోరు మెదపకపోవడం ధర్మయుద్ధం కాక మరేమిటి?!
3. హిందూ ఆలయాలకు అన్యాయం, మదరసాలకు ధనం ఎందుకు?
హిందూ ఆలయాలు సర్కార్ అదుపులో ఉన్నాయి. వాటి ఆదాయాన్ని మదరసాలకూ, హజ్ యాత్రలకూ, వక్ఫ్ బోర్డులకూ, ఇఫ్తార్ పార్టీలకూ, అప్పులకూ ఖర్చు పెడతారు!
మరోవైపు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు అడ్డుకట్టలు, వారి పిటిషన్లను నాన్చడం, మైనారిటీలకు మాత్రం ముందు పీట వేయడం – ఇది న్యాయమా? లేక హిందూ సమాజం మనసుల్లో అగ్నిని రాజేసే పనా?
4. విద్యలో వివక్ష, మతమార్పిడులకు ప్రోత్సాహం ఎందుకు?
విద్యా హక్కు చట్టం ప్రకారం, హిందూ విద్యా సంస్థలు తమ సీట్లలో 25% మైనారిటీలకు కేటాయించాలి. కానీ ముస్లిం, క్రైస్తవ సంస్థలకు ఈ నిబంధనే లేదు!
దీని వల్ల వేల హిందూ పాఠశాలలు మూతపడ్డాయి, హిందూ పిల్లలు వేరే మతాల సంస్థల్లో చేరాల్సి వస్తోంది. ఇది మతమార్పిడులను ప్రోత్సహించడం కాదా? ఈ పక్షపాతం సుప్రీంకోర్టుకు కనపడదా?
5. వాక్ స్వాతంత్ర్యం పై ద్వంద్వ నీతి ఎందుకు?
హిందువులు మాట్లాడితే అది ద్వేషపూరిత ప్రసంగం, ఇతరులు మాట్లాడితే ఫ్రీ స్పీచ్! నుపుర్ శర్మ కేవలం హదీస్ను ప్రస్తావించారు – దాన్ని కోర్టు హేట్ స్పీచ్ అంది.
కానీ స్టాలిన్ లాంటి నాయకులు సనాతన ధర్మాన్ని “వ్యాధి” అన్నప్పుడు – కోర్టు నోరు మెదపలేదు! ఇది నిష్పక్షపాత న్యాయమా?
6. హిందూ పండుగలపై ఆంక్షలు, ఇతరులకు అడ్డూ అదుపూ లేదా?
సుప్రీంకోర్టు హిందూ సంప్రదాయాలపై, ఆచారాలపై కొర్రీలు వేసింది. కానీ హలాల్, ఈద్ సమయంలో జరిగే మూకుమ్మడి పశువధ – దానిపై మాత్రం మాట్లాడలేదు!
జన్మాష్టమికి ఉట్టి ఎత్తుపై ఆంక్షలు, కానీ మొహర్రం హింసపై చర్యలే లేవు! దీపావళి బాణసంచా పర్యావరణానికి చెడు, కానీ క్రిస్మస్ బాణసంచా మంచిదా? ఇది వివక్ష కాదా?
7. ప్రార్థనా స్థలాల చట్టం, 1991లో అన్యాయం ఎందుకు?
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991ని 2019లో కఠినతరం చేశారు. దీని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న మతపరమైన స్థలాల స్థితిలో ఏ మార్పూ చేయరాదు!
ఇది హిందువులు తమ ప్రాచీన ఆలయాలను తిరిగి పొందడానికి మార్గం మూసేసింది. రామ మందిరం కోసం దశాబ్దాలు పోరాడాల్సి వచ్చింది, మిగిలిన ప్రదేశాలు ఇప్పటికీ వారి ఆక్రమణలోనే ఉన్నాయి. ఇది చారిత్రక అన్యాయం కాదా?
8. శబరిమలలో హిందూ మనోభావాలకు భంగం ఎందుకు?
శబరిమల కేసులో కోర్టు హిందూ మనోభావాలను దెబ్బతీసింది. కొన్ని దేవాలయాల్లో పురుషులకు, కొన్నింటిలో మహిళలకు ప్రవేశ సంప్రదాయాలు ఉన్నాయి. కానీ కోర్టు కేవలం హిందువులనే టార్గెట్ చేసింది!
ఇస్లాం లో మహిళలను మసీదులోకి, ఖురాన్ దగ్గరికి వెళ్ళనివ్వకపోవడం, క్రైస్తవ మతంలో మహిళలు పాస్టర్లు కాలేకపోవడం – వాటిపై ఎందుకు ప్రశ్నలు లేవు?
9. షాహీన్ బాగ్, CAA ఆందోళనలపై ఏకపక్ష వైఖరి ఎందుకు?
షాహీన్ బాగ్ ఆందోళనలు, CAA వ్యతిరేక నిరసనలలో జరిగిన అల్లర్లపై సుప్రీంకోర్టు పాత్ర కూడా ఏకపక్షంగా ఉంది. బహిరంగ రహదారులను అడ్డగించిన ఆందోళనలపై పటిష్ట చర్యలు లేవు!
ఇది చట్టాన్ని పాతరేయడం కాదా?
ఇది కూడా హిందూ సమాజంలో ఆగ్రహాన్ని పెంచదా? ఇప్పుడు చెప్పండి…
ఈ అల్లర్లకు న్యాయవ్యవస్థే దోషి కాదా?
సామాజిక అశాంతికి కారకులు న్యాయవ్యవస్థే కాదా?
ఈ న్యాయమూర్తులు అసలు ఎవరి గుప్పిట్లో చిక్కుకున్నారు?
మన భారతదేశపు పునాదులనే పెకిలిస్తున్నారు కదా?
మరి…
రంగనాథన్ గారు చెప్పిన ఈ మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా?
మీరు అంగీకరిస్తే, ఈ పోస్ట్ అందరికి చేరవేయండి
ఈ చర్చ ఆగకూడదు, ఆగనివ్వద్దు!
మూలం: ఆనంద్ రంగరాజన్