– ఆగస్టు 5,6,7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నాం
– తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీ రావాలి
– మీడియా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఆగస్టు 5,6,7 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ కూటమి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ వెళ్తున్నాం.
తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీ రావాలి బీసీ, మేధావులు కుల సంఘాలు అన్ని పార్టీల నాయకులు ఢిల్లీ వచ్చి బీసీల 42 శాతం రిజర్వేషన్లు తెచ్చుకుందాం.
గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4 2024 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కుటుంబాల వారిగా సర్వే జరిపి అందుకు సంబంధించిన నివేదికను సబ్ కమిటీ ద్వారా పరిశీలన చేసి కేబినెట్ లో ఇచ్చి ఫిబ్రవరి 4,2025 రోజు సంవత్సరం కాలంలో దానిని ఆమోదించుకున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు
మార్చి 17 బిల్లు 3,4 తెలంగాణ శాసన సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం, విద్య ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు శాసన సభ ఆమోదించి 22 మార్చ్ గవర్నర్ కి పంపడం జరిగింది
గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుని 30 మార్చ్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరిగింది. రెండు బిల్లులు బిల్లు నంబర్ 3,4 రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రపతి ,గవర్నర్ నిర్ణయాలపై సుప్రీంకోర్టు, చెన్నై హైకోర్టు తీర్పులు జరుగుతున్న పరిణామాల్లో బీసీ లకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఉండే పరిస్థితి నుండి మాజీ ముఖ్యమంత్రి ఫ్యూడలిస్ట్ పార్టీ అధినేత బీసీ కాళ్ల ముకుతాడు వేసి 2018 చట్టం ప్రకారం 50 శాతం లోపల రిజర్వేషన్లు అని తెచ్చి దానిని తగ్గించారు.
ఈనెల 7 తారీకు ఆర్డినెన్స్ చేశాం.14 తారీకు గవర్నర్‌కి ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర నుండి ఆర్డినెన్స్ 2018 పంచాయతీ రాజ్ చట్టం లో ఉన్నటువంటి 50 కాబ్ ఎత్తివేస్తూ మేము ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేశాం దానిని మీరు ఆమోదించి రాష్ట్రపతి కి పంపారు దానిని తీశేయమని విజ్ఞప్తి చేశాం. గవర్నర్ దగ్గర నుండి సానుకూలంగా వస్తుందని ఎదురు చూస్తున్నాం.
హైకోర్టు ఎన్నికల నిర్వహించాలని తేదీలను ప్రకటిస్తుంది. కేంద్రం నుండి రావలసిన బిల్లులు గ్రామపంచాయతీ నిధులు పంచాయతీ యాక్ట్ ప్రకారం రావడం లేదు. మా ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మా నాయకత్వం ఢిల్లీ లో ఇచ్చిన మాట ప్రకారం దాని అమలు పరుస్తూ పోవాలని, ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కానీ కేబినెట్ లో కూడా ముక్తకంఠంతో ఈ అభిప్రాయం పై స్పష్టంగా ఉన్నాం.
కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు ఆమోదింప చేయాలి. బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలతో సహా పార్టీలో ఉన్న బీసీ నాయకులు అరవింద్ , బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య , లక్ష్మణ్ ఐదుగురు బీసీ ఎంపీలు ఉన్నారు. వారిని అడుగుతున్నాం రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును ఆమోదింప చేయాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ బీసీ నాయకత్వం దాని ఖండించి బలహీన వర్గాలకు మద్దతు తెలుపాలని రిక్వెస్ట్ చేశాం. గతంలో కేశవరావు , నేను వాకిటి శ్రీహరి, మహేష్ గౌడ్ , బలహీన వర్గాల శాసనసభ్యులు ఎంపీలు అందరం కలిసి చేతులెత్తి దండం పెట్టాం.
తెలంగాణ ఉద్యమం లాగ స్పూర్తి దాయకంగా బలహీన వర్గాలకు అవకాశం వస్తుంది. 90 శాతం కి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. శాసనసభలో నిజాయితీగా బిల్లులకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లుకు మోకాలు అడ్డుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయినా ఇచ్చిన మాట ప్రకారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.కేబినెట్ లో కూడా నిర్ణయించాం.
ఆగస్టు 5,6,7 మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి ,పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు , రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. తెలంగాణ లో ఉన్న బిసీ మేధావులు,నాయకులు , కుల సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా పోరాడేమో ఈ కీలక మైన దశలో మనం అలా పోరాడాలి
మా ముఖ్యమంత్రితో సహ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు, క్యాబినెట్ మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. ఆగస్టు 5,6,7 తేదీల్లో ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీ రావాలి. ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు బీసీ మేధావులు బీసీ కుల సంఘాలు అందరూ ఢిల్లీకి వచ్చి పాల్గొనాలి.
50 శాతం రిజర్వేషన్ల పై మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే ఎంపైరికల్ డాటా ఉంటుందో రాష్ట్రాలు స్వయంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం 150 ఇళ్లకు ఒక గ్రూపుగా చేసుకుని అన్ని రకాల చర్యలు తీసుకొని లీగల్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొంతమంది మేము సమాచారం ఇవ్వలేదు అని చెబితే బీసీ మేధావుల సలహాల మేరకు మరోసారి ఆన్లైన్ అవకాశం కల్పించాం. మండల కార్యాలయాల్లో ,ప్రజా కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు పారదర్శకంగా అమలు చేస్తున్నాం.క్యాబినెట్ ఏకగ్రీవంగా ఈ అంశాలు చర్చించింది. రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుల సమయ దాటిపోతుంది. కోర్టు ఎన్నికలు జరపాలని చెబుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో 29% బీసీ ,15% ఎస్సి ,10% ఎస్టి తో 64% నడుస్తుంది. కాబ్ ఒక్కసారి ఓపెన్ అయిన తరువాత ఇబ్బందులేంటి?
ఆర్ కృష్ణయ్య అంటే గౌరవం మౌనంగా ఉండొద్దు. 5,6,7 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి నాయకత్వం వహించండి. మీ పార్టీ వాళ్ళని ఒప్పించి ఐదుగురు ఎంపీలను తీసుకొని రండి. సాంకేతికంగా సలహాలు సూచనలు ఉంటే మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం.