(సూరజ్ భరద్వాజ్)
ఒక మోదం, మరో ఖేదానికి జూలై 30 వ తేదీ సాక్షిగా నిలుస్తుంది. భారత్ – అమెరికా సంబంధాలలో అత్యంత విభిన్నమైన పరిణామాలతో ఇవాళ్టి రోజు చరిత్రలో నిలిచిపోతుంది.
ఓవైపు ఇస్రో నాసాతో కలిసి జీఎస్ఎల్వీ రాకెట్ తో, ఇండో – అమెరికా దేశాల సంయుక్త ఉపగ్రహం నిసార్ ను అతి తక్కువ ఖర్చుతో రోదసీలో ప్రవేశపెట్టి ఒక అద్భుత విజయం నమోదు చేయగా, మరోవైపు, ఇండియా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% సుంకం విధిస్తూ నిర్ణయం చేశారు.
అంతేకాదు, భారత్ రష్యా నుంచి ఆయుధాలు, సైనిక సామాగ్రి, చమురు కొనుగోలు చేస్తున్నందుకే దిగుమతుల మీద ఈ అదనపు పన్ను విధిస్తున్నామని ఆయన ప్రకటించారు. జూలై 30 వ తేదీ 2025 నాడు ఇండియా నుంచి యూఎస్ కు ఒక మరపురాని గొప్ప విజయం అందితే, అమెరికా అనుసరించిన కఠిన వైఖరి వల్ల ఒక చేదు అనుభవం భారత్ కు మిగిలింది.