– దటీజ్ బాబు!
సహజంగా సీఎం పర్యటన అంటే లెక్కలేనన్ని వాహనాలు, పైలెట్-ఎస్కార్టు వాహనాలు, పోలీసుల సైరన్లు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించి, పేదలను ఆశ్చర్యపరిచారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి, తాను ఒక సీఎంనన్న విషయం మర్చిపోయి ఆటోలో వెళ్లి కుటుంబాలను పరామర్శించడమే కాదు. అదే ఆటోలో సభవరకూ వెళ్లి తన ప్రత్యేకత చాటుకున్నారు. దటీజ్ బాబు!
జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు.
1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.