– ముస్లిం రిజర్వేషన్ను బీసీల కోటాలో చేర్చి వారికి అన్యాయం
-మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు ఇప్పటివరకు మంత్రి పదవులు ఇవ్వలేదు.
– ఓబీసీ మోర్చా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ :42% బీసీ రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ మహాధర్నా చేపట్టింది. అధికారంలోకి రావడానికి 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ను బీసీల కోటాలో చేర్చి వారికి అన్యాయం చేస్తోంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించి పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ను బీసీలకే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన హామీలన్నీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ, బీసీలకు న్యాయం చేయడంలో విఫలమైంది. 42% బీసీలు ఉన్న రాష్ట్రంలో వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు మంత్రి పదవులు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు.
మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్, ముదిరాజులను BC-D నుంచి BC-A కి షిఫ్ట్ చేస్తామన్న హామీ, యాదవులకు రెండో దఫా గొర్రెల పంపిణీ, గౌడలకు ప్రకటించిన కార్యక్రమాలు అన్నీ అమలవ్వలేదు. ఈ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు?
42% రిజర్వేషన్ను తాము అడ్డుకోవడం లేదని, ఢిల్లీలో ఆపుతున్నారన్న మాటలు వదిలి రేవంత్ రెడ్డి తమ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి అమలు చేయకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేయవలసిన అంశాలను కాలయాపన చేస్తూ బీజేపీపై నిందలు వేయడం తగదు.
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన హామీ యధావిధిగా అమలు కాలేదు. అధికారంలోకి రాగానే ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇప్పుడు బీసీల విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.
బీసీ డిక్లరేషన్ను ఎవరి సలహాతో, ఏ లక్ష్యంతో ప్రకటించారో స్పష్టత లేదు. ఇప్పుడు దానిని అమలు చేయకపోవడమే కాకుండా బీజేపీని విమర్శిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయంపై సమాధానం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.