తిరుపతి: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాలపై, క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక ప్రెస్ స్టిక్కర్లు మీడియా ప్రతినిధులకు అందజేయడం జరిగింది.
ఈ స్టిక్కర్లను స్కాన్ చేస్తే, పాత్రికేయుల పేరు, వారు పనిచేస్తున్న మీడియా సంస్థ పేరు, డిజిగ్నేషన్, కలెక్టర్ ఇచ్చిన గుర్తింపు (అక్రిడేషన్) నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు.
ఈ ఏర్పాటుతో నకిలీగా ప్రెస్ అంటూ తిరుగుతున్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రెస్ స్టిక్కర్లు పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా తయారు చేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.