– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి పిలుపు
పరవాడ: పరవాడలో శనివారం సినిమా హాల్ జంక్షన్ లో దుకాణదారులకు, గృహనియోగదారులతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల గృహాలకి బిగించవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటికే బిగించిన స్మార్ట్ మీటర్ల వలన భారీగావిద్యుత్ బిల్లులు రావడం దుర్మార్గమన్నారు.
వెంటనే విద్యుత్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని ప్రజలకు గని శెట్టి పిలుపునిచ్చారు.వేసిన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను తొలగించాలని గృహాలకు కూడా విద్యుత్ మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విద్యుత్ మీటర్లను రద్దు చేస్తామని విద్యుత్ బిల్లులు ఉండవని వాగ్దానం చేసి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన నారా లోకేష్ నేడు విద్యుత్ బిల్లులను భారీగా పెంచడం భారీగా బిల్లులు వేయడం దుర్మార్గమన్నారు.
వెంటనే స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, ప్రజలపై విద్యుత్ బారాల ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోరుపుటి శ్రీను, వాసు రెడ్డి బాపు నాయుడు, కొల్లి అప్పారావు, జెర్రిపోతుల నూక అప్పారావు, తదితరులు పాల్గొన్నారు