– ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన హామీ రాకుంటే కార్యాచరణ
– ఏపిజేఏసి అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఏపిజేఏసి అమరావతి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనను, ఆవేదనను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ సంఘాల జాయింటు స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం సచివాలయంలో మీడియా తో ఏపిజేఏసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు.
ఉద్యోగులు,పెన్షర్లకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లేకపోతే ఈ నెల 23 వ తేదీ శనివారం జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.