– ఉమ్మడి కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
– పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన సీఎం
విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేటి ఈ ఉపఎన్నికల విజయం రాబోయే ఎన్నో గెలుపులకు తొలిఅడగు. మొదటి గెలుపు. నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసి ఉపఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చారు. ఇందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా.
పులివెందులలో అద్భుతంగా పని చేసి విజయం సాధించారు…ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రజలకు ఒక నమ్మకాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇస్తే ఇటువంటి ఫలితాలే వస్తాయి. కష్టపడాలి, సమిష్టిగా పని చేయాలి, మార్పు చూపించాలి.
పులివెందుల కార్యకర్తలకు నేను ఎప్పుడూ అండగా ఉంటా…కాపాడుకుంటా. పులివెందులలో వైసీపీపై స్థానిక ప్రజలు విసిగిపోయారు. మీరు కష్టపడి పనిచేయాలి. రానున్న రోజుల్లో వచ్చే ప్రతి ఎన్నికలోనూ మనం గెలవాలి. మనం ఢీ అంటే ఢీ అందాం. ప్రజాస్వామ్యయుతంగా ఉందాం.ఎక్కడా అహంకారం వద్దు. నేతలంతా ఐక్యంగా ఉండాలి.
గతంలో కడప ఎమ్మెల్సీ గెలిచాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచాం, ఇప్పుడు జడ్పీటీసీ ఉపఎన్నికల్లో గెలిచాం. మొన్నటి ఉపఎన్నికల్లో మీ కష్టం. సమర్థవంతమైన నాయకత్వం, చక్కటి రాజకీయ వ్యూహం ముందు వైసీపీ అరాచకం, రౌడీయిజం ఓడిపోయింది. జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇక ఏ వర్గం ప్రజలు, ప్రాంత ప్రజలు ఆ పార్టీని, నాయకత్వాన్ని విశ్వసించరు.
మనకు 164 సీట్లు వచ్చాయి. ఇక తీరుగులేదు అని అహంకారం మనలో వస్తే మాత్రం ప్రజలు సహించరు. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలిచ్చిన గెలుపు బాధ్యతను పెంచాలి..నాయకత్వం అనేది నమ్మకాన్ని పెంచాలి. నాయకులు కూడా కార్యకర్తకు అర్థరాత్రి సమస్య వచ్చినా స్పందించేలా పని చేయాలి. పులివెందులలో ఇక అరాచకానికి తావులేదు. కార్యకర్తల భద్రత విషయంలో రాజీలేదు.
సమావేశంలో మంత్రులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, సవిత, బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే భూపేష్ రెడ్డి, బద్వేల్ నేత రితేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు, కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, డీసీఎమ్ఎస్ ఛైర్మన్ జయప్రకాశ్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.