– యూరియా ఎవరు ఇస్తారో తెలియదా?
– ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన అంశం కాదు
– బండి సంజయ్.. ఎరువుల బాధ్యత మీద చొరవ తీసుకోండి
– కాళేశ్వరం కి సంబంధించి రెండో టీఎంసీ ఎప్పుడు రాలేదు
– కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
కరీంనగర్: కేటీఆర్ భాష థర్డ్ క్లాస్ కి మారిపోయి మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డ గా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి, పేద గ్రామీణ వ్యవసాయం కుటుంబం నుండి వచ్చి హైకోర్టు , సుప్రీం కోర్టు జడ్జి గా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. న్యాయ కోవిదుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షింపబడుతుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి ని ఎంపిక చేసింది.
గోడ మీద ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్లకు అలాగే బీజేపీ వెంట వెళ్తారా? తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి గా ఇండియా కూటమి వెంట వస్తారా వారి విజ్ఞత కి వదిలేస్తున్న. బీజేపీ తో ఉన్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీని ఇలాగే తిడతారా? ఎన్డీయే అభ్యర్థికి ఓటేస్తారా అని 9 వ తేది తెలుస్తుంది..
యూరియా ఎవరు ఇస్తే వారికి ఓటు వేస్తామని కేటీఆర్ చెప్తున్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఆయనకు యూరియా ఎవరు ఇస్తారు తెలియదా? యూరియా తెలంగాణ ప్రభుత్వం నుండి తయారు కాదు. ఇది ఉమ్మడి గా కూడా లేదు.యూరియా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. తెలంగాణ కి వివక్ష పూరితంగా ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నారు
తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు,సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు పంపిణీ, సన్న వడ్లకు 500 బోనస్ ,60 వేల ఉద్యోగాలు ,9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ,60 వేల ఉద్యోగాలు,గురుకుల మెస్ చార్జీలు పెంచాం,అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి ఓర్వలేకే బదనాం చేసే కుట్ర జరుగుతుంది.
బీఆర్ఎస్ నాయకులు రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాక్షసానందం పొందుతున్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది కొంతమంది కృతిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన అంశం కాదు. రైతులు గమనించాలి. బీజేపీ బడ్జెట్ నిధులు కేటాయించని నాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేశాం. బీఆర్ఎస్ కలసి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ కి అధిక నిధులు ఇస్తే, తెలంగాణ కు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ తాన తందాన అంటుంది .తెలంగాణ కు అన్యాయం జరిగే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదు. బీజేపీ మౌనంగా ఉంటుంది. మా పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి , మంత్రులు కేంద్ర ప్రభుత్వం ను అనేక సార్లు కలిసాం.
కరీంనగర్ లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతుల ఎరువుల పై నిరసనలు తెలుపుతున్నారు. బండి సంజయ్.. ఎరువుల బాధ్యత మీద చొరవ తీసుకోండి. తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ది. ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మాది.
ఎరువుల పై మా గ్రామస్థాయి నాయకత్వానికి అధికారులకు వ్యవసాయ రైతు వేదికల వరకు ఎలా సమన్వయం చేయాలని అప్రమత్తం చేస్తున్నాం. ఎవరు లేకున్న చెప్పులు లైన్ లో పెట్టి బదనాం చేయాలని చూస్తున్నారు. రాక్షసానందం పొందుతున్నారు. పానిక్ క్రియేట్ చేయడంలో బీజేపీ, బీఆర్ఎస్ లు కాంగ్రెస్ కు వస్తున్న సానుకూల వాతావరణం దెబ్బతీయాలని చూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు,విద్యుత్ పై బాధ్యత వహిస్తాం. మీరు మేము కలిసి ఎరువుల పై కేంద్ర ప్రభుత్వం ను ఒత్తిడి చేయాల్సిందే. ముఖ్యమంత్రి ,పార్లమెంట్ సభ్యులు,వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత పై కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయాం. ఫసల్ భీమా రైతు భరోసా ,రైతు బీమా పై ప్రజా పాలన ప్రభుత్వం తీసుకున్న విధంగా ఇంకా వేరే వాళ్ళు తీసుకోరు.
ఇండియా కూటమి అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అన్ని పార్టీలను కోరారు. సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్న. ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాకు సంబంధించిన సమస్యలు ,ప్రజా అంశాలు , అభివృద్ధిపై చర్చించాం. జిల్లాకు సంబంధించిన సమగ్ర అభివృద్ధిపై చర్చించాం. కాళేశ్వరం కి సంబంధించి రెండో టీఎంసీ ఎప్పుడు రాలేదు. 10 సంవత్సరాలు గా యూనివర్సిటీ నీ నిర్వీర్యం చేశారు. మేము యూనివర్సిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించాం. లా కాలేజి ఇంజనీరింగ్ కాలేజి తీసుకొచ్చాం.
మీరు గత 10 సంవత్సరాలుగా ఈ జిల్లాకు ఏం చేశారు? రెండో టీఎంసీ కి గతిలేదు. మూడో టీఎంసీ పనులు ఎందుకు ప్రారంభించారు చెప్పాలి? తెలంగాణ లో ఎవరి ఇళ్లలో వాళ్లు ఓట్లు ఉన్నాయో చూసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం బీజేపీ కి అనుబంధంగా పని చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.