-టీడీపీ ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి: హిందూ మతం పట్ల, హిందూ ఆచారాల పట్ల హిందూ దేవుళ్లపై జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఏ మాత్రం గౌవరం లేదని టీడీపీ ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై, అర్చకులపై, పూజారులపై జరిగిన దాడులు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో ఒక్క ఆలయంపై అయినా, ఒక్క పూజారిపై అయినా దాడి జరిగిందా? హిందూ ఆలయాలపై, దేవుళ్లపై మాకు ఉన్న నమ్మకం అది. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒబెరాయ్ హోటల్ కు స్థలం కేటాయింపుపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 2021 నవంబర్ 24న ఒబెరాయ్ హోటల్ కు 25 ఎకరాలకు కేటాయిస్తూ జీవో 24 విడుదల చేసింది వాస్తవం కాదా?. మీరు స్థలం ఎక్కడ కేటాయించారు. అలిపిరి నుంచి చెర్లోపల్లికి మధ్య పశ్చిమాన కేటాయించారు. ఆ స్థలంలో జూ పార్క్, ఫారెస్ట్ స్థలం, టీటీడీ స్థలం ఉంది. అక్కడ మధ్యలో 25 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు కేటాయించారు.
టీటీడీలో తీర్మానం చేయించి కేటాయింపులు కూడా చేశారు. ఆరోజు మఠాధిపతులు, పీఠాధిపతులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో పోరాటాలు చేశాయి. అయినా స్పందన లేదు. పనులు మొదలు పెట్టలేదు మా అదృష్టం. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములు మీకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధం లేదు. దక్షిణాన పక్కన భారతీ విద్య భవన్, వేదిక్ కాలేజీ, ఆరవిందో కంటి ఆస్పత్రి, టాటా క్యాన్సన్ ఆస్పత్రి వంటి ప్రైవేట్ సంస్థలు ఉన్న స్థలం ఉంది. వీటి మధ్యలో కొంత భూమి ఇస్తామని టీటీడీ తీర్మానం చేసింది. ఇక్కడ దేవుడికి సంబంధించిన భూమిని ఒబెరాయ్‌కు టీటీడీ ఇవ్వడం లేదు.
ప్రైవేట్ సంస్థలు ఉన్న చోటే టీటీడీ ఆ కేటాయింపులు చేస్తుందని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కేటాయింపులు కూడా చేయలేదు అప్పుడే భూమన బుజాలు తడుముకుంటున్నారు. వైసీపీ హయాంలో జూ పార్క్ పక్కన ఒబెరాయ్ కు భూమి కేటాయించినప్పుడు గాడిదలు కాశావా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మీ ప్రభుత్వం లేకపోతే టీటీడీపై హిందూ దేవుళ్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి ప్రజలు ఉన్నారు. వాళ్లకు అశాంతిని చేకూర్చే విధంగా భూమన వ్యవహరిస్తున్నారు. భూమన అవినీతి, అక్రమాల గురించి మాట్లాడితే రోజులు సరిపోవు. ఇనాం భూములు కొట్టేశాడు.
స్వర్ణముఖి నదికి సమీపంలో తొమ్మిది ఎకరాల్లో కంచే వేసి పెట్టుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించండి. దేవుడి భూమి జోలికి పోతే ఎవరైనా సరే నాశనం అయిపోతారు. భూమన కారుణాకర్ రెడ్డి నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు తిరుమల కొండపై ఉన్నది నల్లరాయి అంటూ మాట్లాడారు. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న భూమన నేడు నీతులు చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రూ.300 కోట్లు విలువ చేసే 10 ఎకరాల భూమిని బడ్స్ ఆస్పత్రి వద్ద ప్రైమ్ ల్యాండ్ సంస్థకు చెందిన సంజయ్ కేదార్ నాథ్ కు విరాళం ఇచ్చారు. తలాతోకలేని కంపెనీకి చిల్డ్రన్స్ ఆస్పత్రి నిర్మిస్తామంటే బ్యాంక్ అకౌంట్ లో రూ.25 వేలు కూడా లేని కంపెనీకి భూములు ఇచ్చారు.
సైట్ విజిట్ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన, భక్తులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అప్పుడు రద్దు చేశారు. మీ ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు విధానాలు అందరికీ తెలుసు. రూ.300 కోట్ల విలువైన భూములను రూ.3 లక్షల ఉన్న కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఒబెరాయ్ కంపెనీతో మీకు క్విడ్ ప్రోకోలో భాగంగా గండికోట, తిరుపతి, విశాఖ, చిత్తూరులో స్థలాలు అప్పనంగా కేటాయించారు.
కూటమి ప్రభుత్వం మీరు చేసిన తప్పులను సరిచేస్తూ వేరే చోట స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యామ్నాయం చూపించాం. ఇంకా స్థలం కూడా కేటాయించలేదు. లేనిది ఉన్నట్టు చెప్పడంలో వైసీపీ నాయకులు పీహెచ్డీ చేశారు. అమరావతి మునిగిపోతుందని బురద జల్లుతారు. పోలవరంపై బురద జల్లుతారు. తప్పుడు ప్రచారాలతో లేనిది ఉన్నట్టు చెప్పడాన్ని వైసీపీ నేతలు మానుకోవాలి. దమ్ముంటే భూమన కరుణాకర్ రెడ్డి సైట్ విజిట్ కు రావాలి. మేం 5 మంది వస్తాం. మీరు 5 మంది రండి. ఎవరి ప్రభుత్వం ఎక్కడ స్థలం కేటాయించిందో చూపిస్తాం.
వైసీపీ హయాంలో మున్సిపల్ స్థలాన్ని హోటల్ కు కేటాయించారు. ఆ రోజు గాడిదలకు భూమన పళ్లు తోముతున్నారా? మీ తప్పులను సరిదిద్దుతుంటే వైసీపీ నాయకులకు వణుకుపుడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు మేం పనిచేస్తున్నాం. జరగనిది జరిగినట్టు గోడవ చేసే విధానాన్ని భూమన కరుణాకర్ రెడ్డి మానుకోవాలి.