– కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు
– బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హైదరాబాద్: కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరానని బహిరంగంగా చెప్పారు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేస్తోంది.
స్పీకర్ కు ఇప్పటికే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉన్నా, నీతి, నిజాయితీ ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కడియం శ్రీహరి రాజకీయ చరిత్ర మొత్తం తెలుసు. వేరే వాళ్లకు పదవి వస్తే కడియం శ్రీహరి ఓర్వడు.
కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ఎన్టీఆర్ హయాంలో మా సోదరుడికి పదవి వస్తే లక్ష్మీపార్వతి కాళ్ళు మొక్కి. పదవి తెచ్చుకున్నారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ దగ్గర చేరి తాటికొండ రాజయ్యపై లేనిపోనివి చెప్పి టిక్కెట్ తెచ్చుకున్నారు.
పెండ్యాల నుంచి కడియం శ్రీహరికి రాజకీయ భూస్థాపితం ఖాయం అయింది. కడియం శ్రీహరి తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారారు. కడియం శ్రీహరి తన అభివృద్ధి కోసం పార్టీ మారారు. 73 ఏళ్ళు ఉన్న కడియం శ్రీహరి సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి.