– డాక్టర్ వీఎస్ ఎన్ఎల్ నరసింహకు వైద్యశాఖ మంత్రి అభినందనలు
అమరావతి: వైద్య విద్య సంచాలకులు(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ డీఎస్ ఎన్ఎల్ నరసింహ ఈ నెలాఖరులన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆయన పనితీరును ప్రశంసించారు. కీలకమైన డిఎంఇ పదవిలో డాక్టర్ నరసింహం వివాదరహితుడిగా పేరుగాంచారని, క్లిష్టతర బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహించారని మంత్రి అభినందించారు. అధికారం కోసం ఆరాటపడకుండా ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించారని మంత్రి అన్నారు. మంచి నిపుణుడైన సర్జన్ గా పేరుగాంచిన డాక్టర్ నరసింహం పదవీ విరమణానంతరం తన సేవల్ని ప్రజలకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.