– కూటమి ప్రభుత్వంతో రాంకీ కుమ్మక్కు
– ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టని పీసీబీ
– పీసీబీతో రాంకీతో కుమ్మక్కయిందా?
– నోటీసులతో సరిపెట్టి వదిలేస్తారా?
– పీసీబీ నోటీసుకు రాంకీ వివరణను వెల్లడించాల్సిందే
– ల్యాండ్ఫిల్పై రాంకీకి జరిమానా వేయరా?
– పెనాల్టీ వేయకుండానే నెల్లూరుకు తరలిస్తారా?
– క్రెబ్స్, కెకెఆర్, ఎసెన్షియాను వదిలేశారా?
– ఎసెన్షియా దుర్ఘటనలో ఫ్యాక్టరీస్ అధికారిపై చర్యలు ఏవీ?
– సీఎం హామీలకే విలువ ఇవ్వని కార్మికశాఖ
– సీఐటియు ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపణలు
పరవాడ: వ్యర్ధరసాయనాలకు జనక్షేత్రంలో విడిచిపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ ఫార్మాతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయినందుకే దానిపై చర్యలను అటకెక్కించిందని సీఐటియు ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పీసీబీతో రాంకీ కుమ్మక్కయినందుకే, నోటీసులిచ్చి దానిని వదిలేస్తున్నారని.. నిజంగా రాంకీతో కుమ్మక్కు కాకపోతే కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పొలాల్లో రసాయన వ్యర్ధాలు వదిలిన క్రెబ్స్, కేకేఆర్ కంపెనీలపై చర్యలు తీసుకోకుండా పీసీబీ వదిలేసిందా అని నిలదీశారు. రాంకీకి పీసీబీ ఇచ్చిన నోటీసుకు రాంకీ యాజమాన్యం ఏం వివరణ ఇచ్చిందో పీసీబీ ప్రజలకు చెప్పాలని, లేకపోతే రాంకీ-పీసీబీ కుమ్మక్కయిందని భావించాల్సి ఉంటుందని గనిశెట్టి స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన రాంకీకి భారీ పెనాల్టీ వేయకుండానే, వ్యర్ధాలను నె ల్లూరుకు తర లించాలన్న పీసీబీ నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సహజంగా ఇలాంటి ఉల్లంఘనలకు పెనాల్టీ వేసే పీసీబీ, రాంకీని ఎందుకు విడిచిపెట్టిందని గనిశెట్టి ప్రశ్నించారు.
ఎసెన్షియాలో దుర్ఘటనలో 17 మంది మృతి చెంది ఏడాది అవుతున్నా, ఇప్పటి వరకూ ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు అధికారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజు సీఎం చంద్రబాబునాయుడు వచ్చి హడావిడి చేసి, బాధ్యులైన అధికారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇప్పటిదాకా ఒక్క అధికారిపై చర్యలు తీసుకోలేదంటే, సీఎం హామీలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు.
ఫార్మా పరిశ్రమల నుండి విడుదలవుతున్న వ్యర్ధ రసానికి జలాలను శుద్ధి చేసి సముద్రానికి పంపించవలసిన నిబంధనలను పూర్తిగా పరవాడ ఫార్మాసిటీలో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ (రాంకీ ) ఈ నిబంధనలన్నిటినీ పూర్తిగా ఉల్లంఘించి వ్యర్థ రసానికి జిల్లాలను సమీపంలో ఉన్న పరవాడ, తానం, భరణి కం, చెరువులు గడ్డల్లోకి వ్యర్థ రసానికి జలాలు విడుదల చేస్తున్నారు.
దీనివలన వ్యవసాయం పండడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్రజలు ఈ వ్యర్థ రసానికి, జలాల నుండి వస్తున్న దుర్వాసనకు భరించలేకపోతున్నారు. ల్యాండ్ ఫీల్డ్ ఎప్పుడో నిండిపోయింది. ఘన వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ నిబంధనలో ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాలతో రాంకీ చెలగాటమాడుతుంది. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది. రాంకీ యాజమాన్యం పరిశ్రమల నుండి వ్యర్ధాలు శుద్ధి చేయడానికి డబ్బులు వసూలు చేసి, వ్యర్ధాలను శుద్ధి చేయకుండా ఈ డబ్బులను రాంకీ యాజమాన్యం అక్రమంగా సంపాదిస్తూ ఉన్నది. ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో పర్యావరణంతో యాజమాన్యం ఆటలాడుకుంటుంది.
కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్ల వ్యర్ధాలు ఎప్పటికప్పుడే పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయం నష్టంతో పాటు భూగర్భ జలాలు నాశనం అయింది. ఈ ప్రాంత ప్రజలు మంచినీరు, మంచి గాలి, మంచి నేల కి నోచుకోలేనిదుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడడానికి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు చేపట్టాలని కోరుచున్నాము.