– రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
మంగళగిరి: గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి వస్తారని సజ్జల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని, రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ‘రాజ్యాంగేతర శక్తి’గా వ్యవహరించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతి కేంద్రంగా మార్చారు. 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నప్పుడు వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు? గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు?. సజ్జల ఏనాడు ప్రజలచేత ఎన్నిక కాలేదు, కనీసం కార్పొరేటర్ స్థాయి ఎన్నికల్లో కూడా గెలవలేదు. అలాంటి వ్యక్తి ఏ హక్కుతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జగన్కు ‘డిఫాక్టో సీఎం’గా వ్యవహరించారని తన కుమారుడితో కలిసి ‘సైకో ఫ్యాక్టరీ’ పేరుతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. “రిజిస్ట్రేషన్ లేకుండా, అకౌంట్ లేకుండా కంపెనీలు నడిపాం” అని సజ్జల స్వయంగా అంగీకరించారన్నారు.
మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాలలో సజ్జల హస్త ఉంది దీనిపై వాస్తవాలు త్వరలోనే బయటకి వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులను మర్డర్, రేప్, దోపిడీ కేసులా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబుపై ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారని అన్నారు. సజ్జల గ్లోబెల్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.