– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్ అధ్యక్షతన ఈనెల 17న జరగబోయే విశ్వకర్మ జయంతి (యజ్ఞోత్సవం) కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విశ్వకర్మ అయిదు వృత్తుల సంఘాల నాయకులు, మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ వృత్తుల నాయకులను, పెద్దలను, మేధావులు వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులు హాజరు అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశం వివరాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీడియా కు విడుదల చేసింది
వడ్రంగులు, స్వర్ణకారులు, కంచర్లు, కమ్మర్లు, శిల్పకారులు నాయకులందరూ వారి సమస్యలను తీర్చేది మోడీ ప్రభుత్వం… మా ఆత్మగౌరవాన్ని నిలిపేది బీజేపీ అని వక్తలు పేర్కొన్నారు. వారి కులాల్లో చరిత్ర, ఔన్నత్యాన్ని వివరించారు. ముఖ్య అతిథి బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. భారతదేశ వేదాలు ఇతిహాసాలు ప్రకారం విశ్వబ్రాహ్మణ గురించి రుగ్వేదంలో ప్రస్తావించారని తెలిపారు. సృష్టి నిర్మాణానికి కారణభూతులని మనిషి అటవిక జీవనం నుంచి నాగరికత జీవనానికి మారిన పరిణామ క్రమం విశ్వకర్మల నైపుణ్యాన్ని అద్దం పడుతుందన్నారు. మన ఆలయం అన్ని భాగస్వామ్యంతో వెలుగొందుతుంది. ప్రతి కట్టడంలో ఐదు బ్రహ్మల నైపుణ్యం కనిపిస్తుంది. ఇది భారత్ కి మాత్రమే ప్రత్యేకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ, ప్రముఖులు దేవు నరసింహాచారి, బీఎన్వీ రాజశేఖర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ వజ్రాల శివకుమార్, స్వర్ణకార రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, ధనాల శోభన్ బాబు, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ తాటికొండ రంగబాబు, తాటికొండ వరప్రసాద్, బ్రహ్మంగారి మఠాల సభ్యులు సామాజిక వేత్తలు, కుల నాయకులు, రాష్ట్ర కో కన్వీనర్ శ్యామ్ సుందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బోయ మురళీ, బీఎస్కే పట్నాయక్, అయినం బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.