– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: ముప్పాళ్ల మండలం ముప్పాళ్ల సాయిబాబా గుడి ప్రాంగణంలో ముప్పాళ్ల మండల కమిటీ అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. దార్శనికుడు విజన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న సంస్థ గత ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
యూరియా పంపిణీ ఆలస్యం అవుతుందని ఫేక్ పార్టీ ఫేక్ పత్రిక ఫేక్ టీవీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రైతన్నలకు సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియా దిగుమతి చేస్తున్నారు. రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.