– మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా ప్రజలకు, వ్యాపారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ సంస్కరణను తీసుకొచ్చారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
యూపీఏ పాలనలో రాష్ట్రాలు, కేంద్రానికి వేర్వేరు రేట్లు ఉండేవి – VAT, Octroi, Entry Tax, ఇతర అనేక పరోక్ష పన్నులు ఉండేవి. ఇవి చాలా గందరగోళాన్ని, సంక్లిష్టతను కలిగించేవని తెలిపారు. మోదీ ప్రభుత్వంలోని జీఎస్టీ సంస్కరణల ద్వారా అత్యవసర వస్తువులకు 0% పన్ను వర్తించనుంది. 28% జీఎస్టీ పరిధిలో ఉన్న వస్తువులు 18%, 12% వస్తువులు 5% లేదా 0% లోకి తగ్గించినట్టు తెలిపారు. దీని ద్వారా మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలుగుతోందన్నారు.
జీఎస్టీ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం “Ease of Living”ని పెంచడం. ప్రజలకు ఎక్కువ ఆదాయం అందించి వారి రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులను తక్కువ ధరలకు అందించటం. ఎంఎస్ఎంఈలు పాత విధానంలో అనేక రేట్లు, సంక్లిష్టత కారణంగా చాలా ఇబ్బందులు పడేవి. ఇప్పుడు 90% రీఫండ్ ఇవ్వడం ద్వారా క్యాష్ ఫ్లో సమస్యలు తొలగిపోయాయి. చాలా సులభంగా, డిజిటల్ రూపంలో చేయొచ్చు.
ఇది కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కాదు. ఇది ప్రజల జీవితాన్ని సులభతరం చేసే, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించే చర్య అని తెలిపారు. ఈ నిర్ణయం వ్యాపార వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది వినియోగంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.