– పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
హైదరాబాద్: రైతుల నుంచి వడ్లు కొనే మిల్లు ఐనా..వడ్ల ను మర ఆడించి ఇచ్చే మిల్లు ఐనా.. సరే ఆయా మిల్లు ల్లో వడ్ల వివరాలు,రైతుల వివరాలు ఉండాలి అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రేడింగ్, వర్కింగ్ రైస్ మిల్లుల్లో.. ఏ రోజు ఎన్ని వడ్లు కొన్నారు, ఎన్ని వడ్లను మర ఆడించారు అనే వివరాలు ఎక్కడా ఉండటం లేదని,తనిఖీ ల సందర్భం లో..”సార్ ఏదో మిల్లు అలా నడుస్తోంది.” అంటూ మిల్లు నిర్వహణ ను కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారని రఘునందన్ ఆక్షేపించారు.
మిల్లింగ్ వివరాలు లేక పోతే మిల్లు లో అక్రమాలు జరుగుతున్నాయి అని అనుమానాలు అధికం అవుతాయి అని రఘునందన్ వివరించారు. ఏ రోజు, ఏ గ్రామం నుంచి ఏ రైతు , ఎన్ని వడ్లు తెచ్చారు,ఎన్ని వడ్లు కొన్నారు ఇలా ..ఈ వివరాలు చిన్న చిన్న “రా” రైస్ మిల్లు ల్లో పొందుపరచాల్సిన అవసరం తో పాటు నిబంధన నియమం ఉన్నాయని మాచన రఘునందన్ స్పష్టం చేశారు