– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా వెంకట శివన్నారాయణ
విజయవాడ: దేశ రాజ్యాంగం, ప్రజల తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కి ఎటువంటి గౌరవం లేదని శివన్నారాయణ మండి పడ్డారు. అపరిపక్వతతో, తెలివి లేకుండా రాహుల్ గాంధీ చేసే ఛాలెంజ్ లకు బీజేపీ నాయకులు స్పందించడం తమకి అవమానకరం అని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, అలాంటి ఎలక్షన్ కమిషన్ కి రాజకీయాలు అంటగట్టడం రాహుల్ గాంధీ కి తగదని అన్నారు.
ఫేక్ లాగ్ ఇన్ లు, ఫేక్ ఫోన్ నంబర్లతో లాగిన్ కావడం కాంగ్రెస్ నాయకులకే ఎక్కువ తెలుసని, కేమ్ బ్రిడ్జి అనలిటికా వంటి సంస్థలతో కుమ్మక్కు అయింది కాంగ్రెస్ పార్టీనని చరిత్ర చెప్తోంది అన్నారు. కేరళ లోక్ సభ సభ్యుడు అయిన రాహుల్ గాంధీ కర్ణాటక సిఐడి కేసు కోసం ప్రెస్మీట్ పెట్టి మాట్లాడడం చూస్తే కర్ణాటక లో ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఎంత దుర్వినియోగ పరుస్తున్నారు అనేది ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
దేశం అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుంటే ఏం చేయాలో తెలియని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని బిట్రా శివన్నారాయణ దుయ్యబట్టారు.