– యాప్ను ప్రారంభించిన జగన్
అమరావతి: కార్యకర్తల కోసం రూపొందించిన వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పార్టీకి సేవలు అందిస్తూ అన్యాయానికి గురవుతున్న వారి కోసం ఈ యాప్ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికలకు ముందు టీడీపీ నేత లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ తరహాలో డిజిటల్ బుక్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆ పార్టీ విమర్శిస్తున్న వైఎస్సార్సీపీ.. తాము అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ బుక్ యాప్ లో నమోదైన ఫిర్యాదులను… పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని అందుకే కార్యకర్తల్లో ఉత్సాహం- ఆత్మస్థైర్యం నింపేదుకే ఈ బుక్ తీసుకువస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.