– అదే సభా ప్రాంగణం. చెట్టు మొదలు దగ్గర నుండి అన్నదాతలకు నమస్కారం
– రైతన్నా.. మీకోసం: వ్యవసాయాన్ని లాభాల బాట పట్టిస్తాం!
– సీఎం చంద్రబాబు శంఖారావం – నల్లజర్లలో ‘పంచ సూత్రాలు’ ప్రకటించిన ముఖ్యమంత్రి
తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల, డిసెంబర్ 3: రైతులే దేశానికి వెన్నెముక! వ్యవసాయమే రాష్ట్రానికి బలం! ఈ నినాదంతోనే కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు నడుం బిగించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు *’పంచసూత్రాల’*తో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్లలో జరిగిన ‘రైతన్నా… మీ కోసం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, వ్యవసాయ యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. అంతకుముందు, అక్కడి రైతులు సాగు చేస్తున్న అంతర పంటలను ఆసక్తిగా పరిశీలించారు.
* వ్యవసాయమే మన బలం: రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే సాగును లాభసాటి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందడమే మా లక్ష్యం.
* పంచసూత్రాల లక్ష్యం: ఆహార అలవాట్లకు అనుగుణంగా సాగు పద్ధతులు మార్చాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలి. అంతర పంటలతో అధిక ఆదాయం పొందాలి. వీటిపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
* ఖజానా ఖాళీ చేసిన గత పాలన: “గత ఐదేళ్లలో పాలన ఎలా ఉందో చూశాం. వ్యవస్థలను సర్వనాశనం చేసి, ఖజానా ఖాళీ చేశారు. కనీసం అప్పు కూడా దొరకని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు.” అందుకే అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని సీఎం విమర్శించారు.
* కరెంట్ ఛార్జీలు పెంచబోం! ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు.
* ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్: తల్లికి వందనం, దీపం-2 కింద 3 సిలిండర్లు, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు, వాట్సాప్ గవర్నెన్స్‌తో పౌర సేవలు… వీటితో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. నీరు.. రైతుకు జీవనాడి!
* కృష్ణా-గోదావరి అనుసంధానం: వృథాగా సముద్రంలోకి పోతున్న కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేసి, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
* భూమిని జలాశయంగా: భూగర్భ జలాలు పెంచుకుంటే కరువు అన్న మాటే ఉండదు. రైట్ కెనాల్ నుంచి నీరిచ్చి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తాం. డిమాండ్ ఉన్న పంటలతో అధిక ఆదాయం!
* రీ-ఓరియేంటేషన్: ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలి. ఏ పంటకు మార్కెట్ ఉంది, కొత్త పద్ధతులు ఏంటి అనే వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తాం.
* అనుబంధ రంగాలే కీలకం: వ్యవసాయం GSDP లో 34% వాటా కలిగి ఉంది. రైతులు డైరీ, పౌల్ట్రీ వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెడితే మరింత ఆదాయం వస్తుంది.
* ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం: రైస్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వరితో పాటు ఇతర పంటలు, పండ్ల సాగుపై దృష్టి సారించాలి. ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం పదిలం.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం: అంతరపంటల సాగులో మెరుగైన పద్ధతులు పాటిస్తున్న రైతులను సీఎం ప్రత్యేకంగా సన్మానించి వారి కృషిని అభినందించారు. “రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారమవుతుంది!” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.