– చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు
– జగన్ కు, చంద్రబాబుకి ఉన్న తేడా అదే
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా అవినీతికి, అరాచకానికి, కక్ష సాధింపుకు, కుల అహంకారంతో బలహీనవర్గాల అణచివేతకు పాల్పడ్డ జగన్ అండ్ కో చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ పాపాలన్నిటి లోనూ మహాపాపం… తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యితో తయారు చేయడం.
అది డబ్బుల కోసం చేశారా లేక శ్రీవారి భక్తుల విశ్వాసాలను కాలరాయడానికి చేసిన కుట్రా అన్న విషయం పక్కన పెడితే… నేరం జరిగింది అన్నది మాత్రం నిజమని సుప్రీంకోర్టు నియమించిన సిట్, సీబీఐలు చెప్పాయి. దీంతో జగన్ పట్ల భక్తులు ఆగ్రహంతో ఉన్నారు.
మరో పక్క చంద్రబాబుగారి పై జగన్ పెట్టిన అక్రమ కేసులో చంద్రబాబు గారికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంకోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వర్గాలు క్యూ కట్టాయి. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ వేసిన ఎత్తుగడలే వైసీపీ బూతు రాజకీయం, కులాల కుంపట్లు రాజేసే కుట్రలు.
ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై బూతులు ప్రయోగించాడు. మరో పక్క జోగి రమేష్ కూడా మంత్రి లోకేష్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడమే ఈ ఇద్దరు నాయకుల పని. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు చాలా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పమని మాత్రమే ఆ ఇద్దరు వైసీపీ నాయకులను డిమాండ్ చేశారు. దీనికి హత్యాయత్నం, ఇళ్లపై దాడి అంటూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని మొదలు పెట్టింది.
మరోవైపు కాపు, బీసీ అంటూ కులాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయమంటూ జగన్ ప్రోత్సహిస్తున్నాడు. ఈ బూతు రాజకీయం జగన్ కు కొత్త కాదు. గతంలో కూడా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలతో బూతులు మాట్లాడించాడు.
గతంలో 100 మంది రౌడీలను వెంటేసుకుని చంద్రబాబుగారి ఇంటిమీద దాడి చేసాడు జోగి రమేష్. అప్పుడు దాన్ని ఏ మాత్రం ఖండించని జగన్ … ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు.
జగన్ కుట్రలను అర్థం చేసుకున్న చంద్రబాబు గారు వైసీపీ ట్రాప్ లో పడొద్దని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, సంయమనం పాటించాలని టీడీపీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తినీ వదలబోమని… పార్టీలకు అతీతంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
జగన్ కు, చంద్రబాబుగారికి ఉన్న తేడా అదే. చంద్రబాబుగారు తప్పు చేయరు. ఎవరినీ తప్పు చేయనివ్వరు. ఇది ప్రజలకు బాగా తెలుసు.