రాజశేఖరరెడ్డి..తాను అధికారంలోకి వచ్చి..ఆ రెండు పత్రికల(ఈనాడు,ఆంధ్రజ్యోతి)మీదా తనదైన శైలిలో దాడిని ప్రారంభించినప్పుడు..ఓ సందర్భంలో..అసలు ఆ రెండు పత్రికలూ నిజాలే రాయవా అని ఎవరో అడిగినప్పుడు..అందుకు రాజశేఖరరెడ్డి…వాళ్ళూ నిజాలు రాయకేం,రాస్తారు.ఎందుకంటే..వాళ్ళు రాసే మిగతా అబద్ధాలకు సాధికారత కల్పించుకోవడానికే ఆ మాత్రం నిజాలు రాస్తారు అని తనదైనశైలి సమాధానమిచ్చాడు.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే…జగన్ ఇబ్బందులలో పడినప్పుడల్లా(పాసుపుస్తకాలమీద తన బొమ్మపై,’మావిగన్’ వంటి అర్థంలేని ప్రతిపాదనలతో కామెడీ పీస్ గా మారుతుండటం ఇత్యాది సందర్భాలలో)షడన్ గా..ఎంతరైపోతారు..ప్రొఫెసర్ నాగేశ్వర్,తెలకపల్లి రవి,ఇప్పుడు మాడభూషి శ్రీధర్ లాంటి వారు.
ఇదేమిటి? జగన్ ను ఇంత అడ్డదిడ్డంగా సపోర్ట్ చేస్తున్నారేమని అడిగామనుకోండి..వెంటనే..తమ పాత వీడియోలు ప్రదర్శించి,వాటి హెడ్డింగ్ లు చూపి..మేము న్యూట్రల్ గా ఉంటే.. మమ్మల్నే ఇలా అంటారా అంటూ..ఇప్పుడు నాగేశ్వర్ బుకాయించినట్లే బుకాయిస్తుంటారు.
ఫాక్ట్స్ కొన్ని ప్రదర్శించి,తమ ఉద్దేశ్యాలను మాత్రం దాపెడతారు(వీరికి అవగాహన ఉందోలేదో గాని..వీరు తాము అనుకూలురం అని చెప్పే మార్క్సిజం ఫాక్ట్స్ కంటే..ఉద్దేశ్యాలే ప్రాముఖ్యం అని చెపుతుందని).కడివడి పాలలో ఉప్పుగల్లు కలపాల్సిన సమయంలోనే కలుపుతారు వీరు.మిగతా సమయంలో తమ పద్ధతిలో తాము వెళ్ళినా !
ఇక ఇప్పటి ఈ నాగేశ్వర్ వీడియో మొత్తం పరిశీలించాక.. అతను ఏమంటున్నాడంటే..తనపై టిడిపి పరివార్ ఇంతగా దాడి చేయడానికి కారణం..తను ఏపి ప్రజల తరపున అడుగుతున్న వాటినన్నింటిని ప్రజలు అర్ధం చేసుకుంటే..బీజేపీతో టిడిపి ఎంతగా రాజీపడిపోయిందో అర్థమైపోతుందనే భయంతోనట !
కానీ..వాస్తవమేమంటే..ఆ మాత్రం సఖ్యతతోనైనా కొన్నిపనులు,కొంతమేరకు సాధించుకోవడం(రాజధానిగా అమరావతి కి చట్టబద్ధత, రైల్వే జోన్ ఇత్యాదివి సాధించుకుంటూ వుండడం)వీరికి ఇష్టంలేదు. టిడిపి,బిజెపి ల మధ్య ఘర్షణ పెరిగి..మరలా తిరిగి 2019 నాటి పరిస్థితి ఏర్పడితే బాగుండు(అది వీరి జగన్ కు ఉపయోగం అనేది వేరే విషయం)అనేదే వీరు దాపెట్టే ఉద్దేశ్యం !
దీన్ని అర్థం చేసుకోవడానికిగాను..ఈయన వాదనల నుంచే కొంత పరిశీలన చేద్దాం !
* రాజధానికి 50000 కోట్లు డిమాండ్ చేయమంటున్నాడు.రాజధానికి ఇస్తామన్న డబ్బు..పరిపాలనా భవనాలకు ఇస్తారేగానీ..చంద్రబాబు కలగంటున్నంత పెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీకి ఇవ్వరని ఈ ప్రొఫెసర్ కు తెలియకనే ఈ డిమాండ్ చేయమంటున్నాడని అనుకోగలమా !? (అక్కడికీ కొంతమేరకు రుణాలకు గారంటీలు ఇస్తున్నారు). తoపులు పెట్టడమే కాదా ఇతని ఉద్దేశ్యం ?
* లాభం రాని రైల్వే జోన్ ఎందుకు అని అడుగుతున్నాడు.ఒరిస్సా ప్రయోజనాలతో కూడా సమన్వయం చేసుకోవాల్సి వస్తదని,ఆ పరిమితుల మధ్యనే ఆ డిమాండ్ ను నెరవేర్చుకోగలమనే అవగాహన లేనివాడా ఈ మేధావి !? తoపులు పెంచడమే కాదా ఇతగాని ఉద్దేశ్యం !
* విజయవాడ _ వైజాగ్ మధ్య బుల్లెట్ ట్రైన్ ఎందుకు డిమాండ్ చేయవు అని అడుగుతున్నాడు..కార్పొరేట్ రాజధాని కాదు.మాకు ప్రజారాజధాని కావాలి అని అడిగే ఈ కమ్యూనిస్టు మేధావే !
* ఇక కడప స్టీల్ గురించి డిమాండ్ చేసి సాధించమని అడుగుతున్నాడు.నిజమే గానీ..దాని చుట్టూ ఉండే రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి..ఆర్థికంగా దాని పీజ్బులిటీ ని గురించి కాస్తన్నా వివరించగలవా ప్రొఫెసర్ !
* ఇక అన్నింటికన్నా ముఖమైన విషయం..హోదా గురించి.విభజన చట్ట సవరణలో దాన్ని డిమాండ్ చేసి ఎందుకు పెట్టించలేదు అని నిలదీస్తున్నాడు మన ఈ మేధావి ప్రొఫెసర్ ! రాష్ట్ర విభజన చేసి 2014 ఎన్నికలకు వెళ్ళే ముందు..తెలంగాణా డిమాండ్ ను ఒక కొలిక్కి తెచ్చి వదిలించుకోవాలి అనే ఆతురుతలో ఏదేదో వాగిన అన్ని పక్షాల వాదనలూ.. రాజకీయంగా కాక.. నిజంగానే సీరియస్ గా తీసుకోగలమా !?
అసలు ఆంధ్రప్రదేశ్ కు మన్మోహన్ మాటవరసకు/మాటగా ఇచ్చిన హామీ.. ఆ ప్రత్యేక హోదా నిబంధనల్లో ఇముడుతుందా ? పోనీ..చుట్టూ ఉన్న కర్ణాటక,తెలంగాణా..లాంటి కాంగ్రెస్ రాష్ట్రాలైన ఇప్పుడు దానికి ఒప్పుకుంటాయా !? ఒప్పించగలరా ? 2019 ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అదే రాజకీయ డిమాండ్ తో ఎన్నికలకు వెళ్లినా..ఎన్నికల తదుపరి ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాయి.అప్పుడు మీ జగన్ ఎందుకు నోరెత్తలేదు.మీరెందుకు అప్పుడు పెద్దగా నోరు తెరవలేదో చెప్పగలరా ?
2024 ఎన్నికల నాటికి హోదా అనేది ఎన్నికల ఎజెండాగానే లేకుండా ఎందుకు పోయింది ? ఇప్పుడు తిరిగి మీ నోటిద్వారా ఎందుకు పలికించబడుతుందీ..ఇత్యాది వన్నీ ప్రశ్నలే ! మీ ఉద్దేశ్యాలను వెల్లడించే అంశాలే ! అందుకే అంటున్నాము నాగేశ్వర్.. బూకరింపులు,బెదిరింపులు మానుకో ! నీ మేధోతనాన్ని నువ్వు తాకట్టు ఎప్పుడో పెట్టావనే.. ఏపీలోని చాలా ఎక్కువ మందికే అర్ధం అయిందనే విషయం అర్ధం చేసుకో !
నోట్ : ఈ మధ్య కాలంలోని ఇతని స్ట్రాటజీలోని మరో ముఖ్యమైన అంశం ఏమంటే..కొందరు తెలుగుదేశం సీనియర్ నాయకులే..తమ ఆవేదనను ఇతనితో పంచుకుంటున్నట్లు,దాన్నే తను వెల్లడిస్తున్నట్లు కవరింగ్ ను కూడా జోడించడం !
-చాకిరేవు