– గురువు గమనించి చెప్పిన నిజం!
ఒక ఉపాధ్యాయుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ — అది కేవలం స్టేటస్ కాదు, ఒక చరిత్రకు సాక్ష్యం.
రాముమన్నం అనే టీచర్ చెప్పింది చిన్న విషయం కాదు. నూరు రోజుల యాక్షన్ ప్లాన్, నవంబర్కే సిలబస్ పూర్తి, డిసెంబర్ నుండి రివిజన్, ప్రతిరోజూ స్లిప్ టెస్ట్, 24 గంటల్లో మార్కుల అప్లోడ్ — ఇవన్నీ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది… ఇది system కాదు, సంకల్పం.
ఫెయిల్ అయ్యే అవకాశమున్న పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ. MEO లు రోజుకు రెండుసార్లు పాఠశాలలకు వెళ్ళడం. ఒక జిల్లాకు ఒక ఇన్క్వైరీ అధికారి. ప్రతి 15 రోజులకూ రివ్యూ. ప్రతి ప్రధానోపాధ్యాయుడితో టెలీకాన్ఫరెన్స్ — లక్ష్యాలు నిర్దేశించడం. ఇది గతంలో ఎన్నడూ లేని వందరోజుల వ్యవస్థ అని ఆ గురువే అంటున్నారు — ఒక ప్రత్యక్ష సాక్షి.
ఇవి గణాంకాలు కావి — ఇది మన పాఠశాలల గర్వం
మద్యం దుకాణాల వద్ద గురువులను అవమానించిన ఒక చీకటి అధ్యాయం తరువాత ఈరోజు — లోకేశ్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ శరవేగంగా తిరిగి లేస్తోంది.
విద్యలో మార్పు చాటుకోవడం సులభం. చేసి చూపించడం కష్టం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే ముందుకు వచ్చి “ఇది జరిగింది, మేం చూశాం” అని చెప్పినప్పుడు — ఆ మాటకు విలువ వేరేగా ఉంటుంది. సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు అనే వార్తల బదులు అంతులేని ఆనందం అనే ప్రభుత్వ బడుల పిల్లలు, ఉపాధ్యాయుల భావోద్వేగాలతో మీడియాలలో వార్తలు రావడం మొదటిసారి.
టీచర్ రాశాడు — చరిత్ర చదువుతోంది