– ‘విజయ్ రూట్ మాఫియా’ – మారిదాస్
మారిదాస్ … తమిళ్ష్ నాడులో ఈ పేరు సుపరిచితం! ఎవరికీ భయపడకుండా రాజకీయ జీవుల నీచత్వాన్ని సూటిగా తెలియజేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, జాతీయతా వాది మారిదాస్. ముఖ్యంగా మారిదాస్ విదేశీ మతోన్మాది, మేధావి కాదు! మారిదాస్ మామూలు వ్యక్తి.
2020లో పెరియార్ విషయంలో ఒక 60యేళ్ల అసత్య ప్రచారాన్ని సాక్ష్యాధారంతో బట్టబయలు చేసి పెరియార్ బతుకును బయటపెట్టారు మారిదాస్. అప్పుడే నేను మారిదాస్ గురించి తెలుగులో రాశాను. గత 5యేళ్లుగా డీ.ఎమ్.కె. భయంకరమైన అవినీతిని, క్రూర రాజకీయాన్ని ఎండగడుతూనే ఉన్నారు మారిదాస్.
విజయ్ విజయం ఎలా సాధ్యపడిందో ‘రూట్ మాఫియా’ పేరుతో ఒక వీడియో చేసి విడుదల చేశారు
మారిదాస్. తమిళ్ష్ నాడులో ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది.
విజయ్ విజయం వెనుక విదేశీ క్రైస్తవ లాబీ ఎలా పనిచేసిందో, ఎంత బలంగా పనిచేసిందో సరైన సమాచారం కూడా సోషల్ మీడియాలో వస్తోంది.
విజయ్ ముఖ్యమంత్రి కావడానికి స్టాలిన్ వెన్నుదన్ను కావడం మనం చూశాం. స్టాలిన్ ఎందుకు విజయ్ ముఖ్యమంత్రి కావడానికి కారణమయ్యారు?
విజయ్ విజయం క్రైస్తవ లాబీ విజయమా? అన్న నా భయాన్ని నేను ఈ వరకే వెలిబుచ్చాను. విజయ్ విజయం తమిళ్ష్ నాడుకు మాత్రమే కాదు దేశానికి ‘క్రైస్తవ లాబీ దెబ్బ’ కానుందా?
విజయ్ గెలుపు దేశంలో ఏ మలుపు కానుంది? విజయ్ గెలుపు మెదడు ఉన్నవాళ్లకు ఏదో వెరపును కలిగిస్తోందా?
విజయ్ గెలుపు ఎమ్.జీ.ఆర్. గెలుపులా సహజమైనది కాదు అన్నది భవిష్యత్తులో మనకు తెలియవస్తుందా?
తెలుగువాళ్ల కోసం ఆ మారిదాస్ వీడియోను ఇక్కడ ఇస్తున్నాను.
మారిదాస్ – ‘విజయ్ రూట్ మాఫియా’ వీడియో చూడండి. ఇంగ్లిష్ లో ఉంది.
– రోచిష్మాన్
9444012279