Suryaa.co.in

Political News

అమరావతి రైతుల పాదయాత్రకు ప్రకాశంజిల్లా ప్రజల మహా స్వాగతం

ప్రభంజనంలా కదిలి వచ్చిన ప్రజల చిన్న నందిపాడు వద్ద ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు,సీపీఎం,సిపిఐ నాయకుల, జె.ఏ.సి నేతల ఘన స్వాగతం హారతులు ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు
ఆకట్టుకున్న కోలాటం డప్పు కళాకారుల నృత్యం కిలోమీటర్ల మేర జన సందోహం సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ వామపక్షాలు బిజెపి జనసేన
మద్దతు తెలిపిన తెలంగాణ రైతుల
లక్ష విరాళం అందించిన నల్గొండ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపి రాజధాని ఆకాంక్షను తెలిపిన ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగులు మహిళలు
జై అమరావతి, జయహో అమరావతి ఏకైక రాజధాని అమరావతి మిన్నటుతుండగా.. సేవ్ అమరావతి ఫ్లకార్డులతో యువత, ఆకుపచ్చ చీరలు కట్టుకుని మహిళలు.. ఆకుపచ్చ కండువాలు, ఆకుపచ్చ జెండాలతో రైతులు… పక్క రాష్ట్రం రాజధానికి సంఘీభావంగా తెలంగాణ వాసులు మహా సంకల్పంతో మహాపాదయాత్రలో కదం తొక్కారు.
ప్రకాశం జిల్లా సరిహద్దు చిన్న నందిపాడు సరిహద్దు వద్ద తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు,కొండెపి ఎమ్.ఎల్.ఏ.స్వామి, అద్దంకి ఎమ్.ఎల్.ఏ రవికుమార్, టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్.ఎల్.ఏ.దామచర్ల జనార్దన్,జె.ఏ.సి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు జె.ఏ.సి నేతలు పర్చూరు,చీరాల,ఒంగోలు,దర్శి,అద్దంకి, సంత నుతలపాడు నియోజకవర్గాల నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.
అమరావతికి మద్దతు
అమరావతి ఆంధ్రుల ఆకాంక్ష అంటూ రైతుల మహా పాదయాత్రకు వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు, ప్రజా, విద్యార్ధి సమాసం ప్రకటించాయి. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేత పెద్దసంఖ్యలో తరలివచ్చి అమరావతికి మద్దతు ప్రకటించి పాదయాత్రలో రైతులకు కలిసి ముందుకు సాగారు. పెదనందిపాడు శివారు నుంచి పర్చూరు నియోజకవర్గ కేంద్రం వరకు కిలోమీటర్ల మేర జనసంద్రం తో రోడ్లు కిక్కిరిసాయి.
నాగలితో రైతుల ప్రదర్శన…
పర్చూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ట్రాక్టర్లు నా గళ్ళతో వినూత్నరీతిలో ప్రదర్శన నిర్వహించారు. రాజధాని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ట్రాక్టర పై రైతులు నాగలి ఎత్తుకొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణంతో వెనుకబడ్డ ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కోలాటంతో మహిళల నృత్యాలు
రాజధాని అమరావతి తమ లక్ష్యమని వందల రోజులుగా దీక్షలు చేపట్టిన వైసిపి ముద్దు ప్రభుత్వం స్పందించలేదని రాజధాని ఆకాంక్షను ఆ భగవంతుడే తీర్చాలని న్యాయస్థానం టు దేవస్థానం యాత్రకు శ్రీకారం చుట్టి మహా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులకు సంఘీభావంగా మహిళలు కోలాటాలతో నృత్యం చేశారు . చిన్న నందిపాడు నుంచి పర్చూరు వరకు యాత్ర కు మద్దతుగా కోలాట నృత్యాలు చేశారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు
పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాది మంది మహిళలు పాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చారు రాజధాని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కిలోమీటర్ల మేర సాగిన యాత్ర లో అగ్రభాగాన నిలిచారు. వివిధ మండలాల నుంచి ఉదయం 7 గంటలకే చిన్న నందిపాడు కి చేరుకున్నారు.
భారీ ఎత్తున జన సందోహం నేపథ్యంలో యాత్ర కొంత ఆలస్యంగా సాగింది. అయినా ఓపికతో మహిళలు యువత గంటల తరబడి యాత్ర కోసం వేచి చూశారు. మహిళలకు ఉండగా యువత విద్యార్థులు నిలిచారు.
భారీగా విరాళాలు…
అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతుగా పర్చూరు నియోజకవర్గంలో రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు లక్షలాది రూపాయలను విరాళంగా అందించారు ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో ఆ విరాళాలను జేఏసీ నేతలకు అందజేశారు.
తరలివచ్చిన బాపట్ల చీరాల ప్రజలు
మహా పాదయాత్రకు మద్దతుగా వేలాదిమంది తరలివచ్చారు. పాదయాత్రకు సంఘీభావం రాజధాని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తరలివచ్చిన ప్రకాశం నేతలు
మహా పాదయాత్రకు సంఘీభావంగా ప్రకాశం జిల్లా సరిహద్దు నందిపాడు కు ప్రకాశం జిల్లా నేతలు ఉదయమే చేరుకున్నారు. కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, ముత్తముల అశోక్ రెడ్డి, జీవీ ఆంజనేయులు, డేవిడ్ రాజు,తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ మంత్రి రావెళ్ళ కిషోర్, తెలుగుదేశం పార్టీ నేతలు ఎరిక్షన్ బాబు, వేగేశన నరేంద్ర వర్మ, దామచర్ల సత్య, విజయకుమార్, తెలుగు మహిళ బాపట్ల పార్లమెంటు అధ్యక్షురాలు పృద్వి లత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, తెలుగురైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య,జె.ఏ.సి ప్రతినిధులు ఎమ్.ఎల్.నారాయణ, జి. వి.కొండారెడ్డి, చుంచు శేషయ్య,చుండూరి రంగారావు, శ్రీపతి ప్రకాశం,పి.వి.ఆర్ చౌదరి,చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నార్నే వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
అడుగడుగునా జన నీరాజనం
అమరావతి మహిళలు, రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. చిన్ననందిపాడు నుంచి అడుసుమల్లి, బొడ వడా వరకు ప్రజలు అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులు పూలు చల్లుతూ నీరాజనం పలికారు.
ప్రభుత్వం మెడలు వంచి రాజధాని సాధిస్తాం : జె.ఏ.సి
ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, రాజకీయ స్వార్థం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా అనాగరికంగా అరాచకంగా వికృత చేష్టలకు పాల్పడుతుంది. ప్రభుత్వం మెడలు వంచిన రాజధాని ఆకాంక్షను నెరవేరుస్తాం. ఐదు కోట్ల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్న రాజధానినీ విస్మరించడం వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు సైతం సంఘీభావం తెలుపుతున్నారు. ఇది శుభపరిణామం. అమరావతి రైతులు చేస్తున్న ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. దీనిని ఆపడం ఎవరి తరం కాదు. ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ పతనం ఖాయం. మహా పాదయాత్రకు సంఘీభావంగా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారంటే రాజధాని ఆకాంక్ష అంత బలంగా ఉందన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర 12 రోజుల పాటు ప్రకాశంజిల్లాలోని పలు నియోజకవర్గాల ద్వారా పాదయాత్ర కొనసాగుతుందని జె.ఏ.సి.నేతలు తెలిపారు.. శనివారం 7 వ తేదీ పర్చూరు నియోజకవర్గం నుండి 8 వ తేదీ దగ్గుపాడు,ఇంకొల్లు,9 వ తేదీ దుద్దుకురు,10 వ తేదీ నాగులుప్పలపాడు, రాచర్ల,12 ముక్తినుతలపాడు నుండి ఒంగోలు నగరం ,13 న ఎరజర్ల,ఎమ్.నిడమానూరు,మర్లపాడు,14 విక్కిరాల పేట,15 న కందుకూరు, ముప్పరాజు కోష్టాలు,16 కందుకూరు లో విశ్రాంతి,17 మాచవరం, మోపాడు,18 న చిన్నలటరపి,గుడ్లూరు లో పాదయాత్ర ముగిసి నెల్లూరు జిల్లాకు చేరుతుందని ప్రకాశంజిల్లా జె.ఏ.సి.నాయకులు తెలిపారు.
మహా పాదయాత్ర షెడ్యూలులో స్వల్ప మార్పు
రాజధాని అమరావతి పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పర్చూరు నియోజకవర్గంకు శనివారం చేరుకుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. 7 వ తేదీన యాత్ర పర్చూరు నుంచి నేరుగా ఇంకొల్లు కు చేరుకుంటుంది. 8వ తేదీన ఇంకొల్లు లో రైతులు విశ్రాంతి తీసుకోనున్నారు. కనుక యాత్ర 8వ తేదీ రద్దు చేయడం జరిగింది. తిరిగి 9వ తేదీన ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర కొనసాగుతుందని ప్రకాశంజిల్లా జె.ఏ.సి నేతలు తెలిపారు.

LEAVE A RESPONSE