జగ్గయ్యపేట: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని పదో వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి అన్నారు. ఎన్నికలు ఏవైనా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అన్నారు.