-మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నంత మాత్రాన కథ ముగిసిపోలేదు
-సీఆర్డీఏ యాక్ట్ 2014ప్రకారం ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాల్సిందే
-రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాజధానికి సంబంధించిన కేసులుంటాయి
-టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
మూడురాజధానుల బిల్లుతోపాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఆర్డీయే బిల్ యాక్ట్ 28/2020 ని కూడా రద్దుచేసి, దానిస్థానంలో పాత సీఆర్డీయే బిల్ యాక్ట్ 2014కి తిరిగి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ఒకబిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టడంజరిగిందని, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఒక కాంప్రహెన్సివ్ బిల్ ని మళ్లీ తీసుకొస్తామని, మూడురాజధానులపై తాము వెనక్కి తగ్గడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పాతసీఆర్డీఏ చట్టం 2014 తిరిగి ప్రాణంపోసుకొని యథావిధిగా అమల్లోకివచ్చింది. మూడురాజధానుల బిల్లుకి చట్ట బద్ధత లేదని న్యాయస్థానంలో జరిగిన వాదనలతోతేలిపోయింది. అదేసమయంలో రాజధాని రైతులమహాపాదయాత్రకు ప్రజలురోజురోజుకీ జననీరాజనం పడుతున్నారు. ఏ ఉద్యమమైనా నదిలా ఉంటుందట…పుట్టినచోట నది పెద్దగా కనిపించదు.ప్రవాహాంలో దాని అసలురూపాన్ని సంతరించుకుంటుంది.
అలానే అమరావతి ఉద్యమం నానాటికీ పెద్దనదిలా మారి ప్రభుత్వాన్ని ముంచేయబోతోంది. అమరావతి ఉద్యమం ఒకకులానికి, ఒకప్రాంతానికి పరిమితమైందని దుష్ప్రచారంచేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఏముఖంపెట్టుకొని మూడు రాజధానుల బిల్లుని రద్దుచేసింది. ప్రభుత్వానికి తప్పుచేశామని అర్థమైందికదా! ప్రభుత్వం ఏర్పాటుచేసిన మూడురాజధానుల శిబిరంలోని వ్యక్తులు ప్రభుత్వనిర్ణయంపై ఎందుకు స్పందించడంలేదు? రాజధానిరైతుల 700రోజుల కృషికి ఫలితం వచ్చిందని మేం నమ్ముతు న్నాం. అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ లుఎవరో అర్థమైంది.
చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన సీఆర్డీఏ బిల్ 2014 చట్టంలోని అన్నిఅంశాలను ప్రభుత్వం అమలుచేయాల్సిందే. ఏదైతే మూడురాజధానుల బిల్ గవర్నర్ ఆమోదానికి పంపారో, అది రాజ్యాంగంలోపొందు పరిచిన విధంగా లేదని , కౌన్సిల్ ఛైర్మన్ సంతకంలేదనేది ఒకఅంశం. రెండోఅంశం సీఆర్డీఏని రద్దుచేస్తూ కొత్త చట్టంతేవడంలోగానీ, మూడురాజధానుల బిల్లు పెట్టేవిధానంలో రాజ్యాంగ ధిక్కరణ ఉందనేది మూడోఅంశం. సీఆర్డీఏ 2014చట్టంలో రైతులకు ఇచ్చినహామీలు అమ లు చేయాల్సిందే. మూడురాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నంత మాత్రాన రైతుల సమస్య పరిష్కారమైనట్టుకాదు. వారికి జీవితాలను ఈ ప్రభుత్వం గాల్లో దీపాలుగా మార్చింది. వారికి చేయాల్సినవాటిపై, ఇస్తామన్నవాటిపై ప్రభుత్వం సమాధానంచెప్పాల్సిం దే. రైతులసమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు రాజధానికి సంబంధించి కోర్టుల్లోఉన్న కేసులు కొనసాగుతూనే ఉంటాయి.
ముఖ్యమంత్రి నేడు సభలో మరోపచ్చిఅబద్ధంచెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్షకోట్లు అవసరమవుతాయన్నారు. రూ.లక్షకోట్లతో నిజంగా రాజధాని అభివృద్ధిచేసుంటే, నేడు దానివిలువ రూ.15లక్షలకోట్ల నుంచి రూ..20లక్షలకోట్లు అయ్యేది. ఈ ముఖ్యమంత్రి కేవలం రెండున్నరేళ్లలోనే రూ.3లక్షలకోట్ల అప్పుచేశారు. అది ఎవరు తీరుస్తారు? అది ఇంకా రూ.5లక్షలకోట్లకు చేరనుంది. ప్రభుత్వం రూ.5లక్షలకోట్లు అప్పుచేస్తే అది ఎవరుతీరుస్తారో కూడా ముఖ్యమంత్రి చెప్పాలికదా!
రూ.లక్షకోట్లు ఖర్చుపెడితే, రూ.15లక్షలకోట్ల ఆదాయం ఎలావస్తుందో హైదరాబాద్ నగరాన్ని చూసి చెప్పొ చ్చు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొన్నివర్గాలప్రజలను సంప్రదించి, అభిప్రాయాలు తీసుకోవా లంటూ అమరావతిపై నిందలేసే పనిలోనేఉంది. మూడురాజధానులు ఇంకా ఉంటాయి. కేంద్రప్రభుత్వం ఇప్పటికే హైకోర్ట్ ఎక్కడుండాలో చెప్పింది. దానిప్రకారం అమరావతే రాజధా ని. దాన్ని మార్చే అధికారం అసెంబ్లీకి లేదు. మిగిలిన విశాఖపట్నం, కర్నూల్ లో గురించి మాట్లాడాలంటే ముందు అమరావతి రైతులకుచట్టబద్ధంగా న్యాయంచేయాలి. ఏదైనా బిల్ పై ముందు గవర్నర్ సంతకం పెట్టాలి. తరువాత మండలిఛైర్మన్ సంతకంఉండాలి. ఛైర్మన్ సంత కం లేని బిల్ కోర్టు ముందుకురాబోతోంది.
దాంతోప్రభుత్వం పరువుపోతోందని గమనించే మూడురాజధానుల బిల్లుని కోర్టునుంచి ఉపసంహరించుకున్నారు. బిల్లులోని పొరపాట్లను గమనించి వెనక్కుతీసుకున్నా, దానిలోని అంశాలను తామువదిలిపెట్టడంలేదు. ప్రజలకు, మరీ ముఖ్యంగా రాజధాని రైతులకు ఒకటే చెబుతున్నాం. మనపోరాటంలో తొలిమెట్టు మాత్రమే ఎక్కాము. చట్టసభల్లో సాధించలేని విజయాన్ని ప్రజాపోరాటంతో సాధించాము. ప్రజా పోరాటానికి ఎంతటివారైనా తలొగ్గాల్సిందే. మోదీప్రభుత్వానికి పూర్తిమెజారిటీ ఉన్నా.. సాగుచట్టాలను వెనక్కుతీసుకుంది. ఒకమంత్రి అంటున్నారు..ఇది ఇంటర్వెల్ మాత్రమే అని. ఇంటర్వెల్ తర్వాతే విలన్ లు తన్నులు తింటారు. అది మంత్రి, ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు మధ్యఉన్న వ్యత్యాసాన్ని పాలకులు గుర్తించాలి. అప్పటివరకు రాజధాని ఉద్యమం అలానేఉంటుందని స్పష్టంచేస్తున్నాం.