మేథమేటిక్స్‌లో.. డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న.. అత్యంత క్లిష్టమైన “జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం (Zariski Cancellation Problem)” కు పరిష్కారం సూచించింది.. ఆమె పేరు నీనా గుప్త. మేథమేటిక్స్ ప్రొఫెసర్.అందుకు గానూ ఆమెకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “రామానుజన్ ప్రైజ్” లభించింది. కానీ ఈమె సాధించిన ఈ విజయం గురించి మాట్లాడిన మీడియా లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ పెద్దగా ప్రస్తావించలేదు.
ఇలాంటి గొప్ప విషయాలకు, విజయాలకు ప్రచారం కల్పించకపోతే.. మన పిల్లలు, మహిళలు ఏవిధంగా స్ఫూర్తి పొందుతారు? వారిలో ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలు ఎలా ప్రోది చేసుకొంటాయి?
అందరి దృష్టి మిస్ యూనివర్స్ “హర్నాజ్ సంధు” మీదే.దురదృష్టం కాదా?
నీనా గుప్తా గురించి మరిన్ని విశేషాలు
ప్రొఫెసర్ నీనా గుప్తా, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) లో గణిత శాస్త్రవేత్త. ప్రపంచంలో ఈ బహుమతిని (రామానుజన్ ప్రైజ్) అందుకున్న మూడవ మహిళ.గణిత శాస్త్రవేత్తగా నీనా గుప్తా ప్రయాణం: 2006లో కోల్‌కతాలోని బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్రంలో ఆనర్స్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, నీనా గుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత, ప్రొఫెసర్ గుప్తా బీజగణిత జ్యామితిలో తన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (PhD)ని అభ్యసించారు.2014 సంవత్సరంలో జారిస్కీ యొక్క Cancellation Problem పై తన మొదటి పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ఆ పరిశోధనా పత్రానికి ఆమెకు అవార్డు లభించడమే గాకుండా ఇతర గణిత శాస్త్రజ్ఞులచే విస్తృతంగా గుర్తించబడింది.
అవార్డులు మరియు గౌరవాలు: 2014 లో, ప్రొఫెసర్ నీనా గుప్తా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుండి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 2019 లో, ప్రొఫెసర్ గుప్తా, 35 సంవత్సరాల వయస్సులో ‘శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్’ అందుకున్న అతి పిన్న వయస్కులలో ఒకరు అయ్యారు.
రామానుజన్ ప్రైజ్ గురించి: భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పేరు పెట్టబడిన ఈ బహుమతిని మొదటిసారిగా 2005లో ప్రదానం చేశారు. అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ (ICTP) డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), భారత ప్రభుత్వం మరియు అంతర్జాతీయ గణితశాస్త్రం (IMU) తో సంయుక్తంగా ప్రదానం చేయబడుతుంది.