Suryaa.co.in

Business News National

రిలయన్స్ కు చుక్కలు చూపిస్తున్న వివేక్ రే..

రిలయన్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు.
అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి. ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న రిలయన్స్ కు ఓ అధికారి ఫైన్ వేశాడు..
కోట్ల మంది ప్రజలకవసరమైన విద్యుత్ ను తన లాభాలకు లంకె పెట్టుకుని రిలయన్స్ ఆట ఆడుతోంది. అసలు ప్రభుత్వం ఏంటో ఒప్పందాల విలువ ఏంటో..చట్టం ఎలా పనిచేస్తుందో.. అంబానీలకు తెలియచెబుతున్నాడు.అతనే ఆయిల్ శాఖ సెక్రటరీ వివేక్ రే.. దాదాపు 7వేల కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సిందేననితేల్చి చెప్పాడు.
2012-13లో రోజుకు యావరేజ్‌గా 86.73 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్స్ తీయాల్సి ఉంటే రిలయన్స్ అందించింది కేవలం 26.07 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్స్. 2012-13 నాటికి రిలయన్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రు.798 కోట్లు ఇప్పటికే రిలయన్స్‌ రూ.721 కోట్లు చెల్లించింది.కృష్ణా గోదావరి బేసిన్‌ నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ను రిలయన్స్ తన లాబీయింగ్‌తో.. మాయోపాయంతో దక్కించుకుంది.
అంబానీలకు సలాములు చేసే అధికారగణాలు అన్నీ అనుకూలంగా చేసి పెట్టారు. ఒప్పందం ప్రకారం అందించాల్సిన గ్యాస్‌ను తీయడంలో రిలయన్స్ నాటకం ఆడింది.రేటు సరిపోదని పెంచాలని ప్రభుత్వానికి కాగితాలు పంపి.. వత్తిడి చేసింది. అది తేలేవరకు కావాలనేప్రొడక్షన్‌ లేటు చేసింది. దీని వలన కోట్లాది భారతీయులు నష్టపోయారు.రిలయన్స్ మాట విననందుకు పెట్రోలియం శాఖా మంత్రే మారిపోయారు.ఇక రిలయన్స్ తరపున ప్రభుత్వ రంగస్ధలంపై కేంద్ర మంత్రుల వేషాలు మొదలయ్యాయి.
పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి డాలర్లు పెట్టాల్సి వస్తోందని… అందుకే రూపాయి పడిపోతుందని… మన దేశంలో ఉన్నదాన్ని వాడుకోవాలంటే రిలయన్స్ కు రేటు పెంచాలని.. వింత వాదాన్ని వినిపించారు.చివరికి కోరిక తీర్చారు. రేటు పెంచారు. ప్రజలకు విద్యుత్, గ్యాస్‌ రేట్లు పెరుగుతాయని ప్రతిపక్షాలు మొత్తుకున్నా వినలేదు. ఇప్పటికే ఇవ్వాల్సిన ఉత్పత్తి అందించని రిలయన్స్ ను మాత్రం ఎవరూ ఏమీ అనలేదు.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మాత్రం భారీగా ఏర్పాటు చేసింది. ఆ ఖర్చంతా వెనక్కు తీసుకున్నాకే.. ప్రభుత్వానికి వాటా దక్కుతుంది.ఖర్చంతా ప్రభుత్వం కూడా భరిస్తున్నప్పుడు… రిలయన్స్ నష్టపరిహారం ఎందుకు కట్టదనే అంశాన్ని ఒప్పంద పత్రాల నుంచి వివేక్‌ వెలికి తీశారు.కేంద్ర మంత్రులు లొంగిపోయినా… ఆయిల్‌ శాఖ సెక్రటరీ వివేక్‌ రే మాత్రం వదిలిపెట్టలేదు.రిలయన్స్ 7 వేల కోట్ల డాలర్ల ఫైన్‌ చెల్లించాలని నోటీస్‌ ఇచ్చారు.దీని మీద కోర్టుకు వెళ్లడానికి రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి కామన్‌ ఆర్బిట్రేటర్స్‌గా ఇద్దరు జడ్జిలను నియమించే ప్రాసెస్‌ నడుస్తోంది.
దీనికి మళ్లీ కేంద్ర మంత్రుల సహాయ సహకారాలు అందుతున్నాయి. కాకపోతే రూల్స్ దెబ్బకు ఏమీ చేయలేక గింజుకుంటున్నారు.ప్రభుత్వాలనే ఆటాడిస్తున్న రిలయన్స్‌ రెక్కలు విరుస్తున్న వివేక్‌కు ఏ మాత్రం మద్దతు లభిస్తుందో చెప్పడం కష్టం.కేంద్ర మంత్రులే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాక… ఫైన్‌ వసూలు ఎంత వరకు సాధ్యమో చెప్పలేం.అయితే తన బాధ్యతను సాహసోపేతంగా నిర్వహించిన వివేక్‌ రేకు ప్రజల మద్దతు మాత్రం లభిస్తుందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి

LEAVE A RESPONSE