Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి అంతా జగన్ ప్రభుత్వ సృష్టే

• డైరెక్టర్లలో ఒకరైన లక్ష్మీనారాయణ ఒక్కడే అవినీతిచేశాడని ఈప్రభుత్వం ఎలా చెబుతుంది? నిజంగా అవినీతి జరిగితే రెండున్నరేళ్లు ఈ ప్రభుత్వం ఏం చేసింది
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అవినీతికి సంబంధించి సీఐడీ నమోదుచేసిన ఎఫ్ ఐఆర్ ఆసాంతం తప్పులతడకే
• ఆఖరికి లక్ష్మీనారాయణ ఏ సంస్థలో డైరెక్టర్ గా పని చేశాడనేది కూడా ఎఫ్ఐఆర్ లో సరిగా లేదు
• గతంలో అచ్చెన్నాయుడుగారు, లోకేశ్ గార్లపై చేసిన అవినీతి ఆరోపణల్లాంటివే.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిందంటున్న అవినీతి కూడా
– టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కక్ష సాధింపు చర్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పరిపాలన అనేది ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని, ప్రజావేదిక కూల్చివేతమొదలు, తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణపై జరుగుతున్నవేధింపులవరకు చూస్తే, ముఖ్యమంత్రి ఆలోచనావిధానం, ప్రభుత్వ తీరు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
సీమెన్స్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారంలో నిజంగా అవినీతి జరిగిఉంటే, వైసీపీప్రభుత్వం ఇన్నాళ్లనుంచి ఏంచేసింది? అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దానిలోజరిగిన అవినీతి ఈ ప్రభుత్వానికి కనిపించలేదా? గతంలో కూడా ఈఎస్ ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడుగారు, మరోదానిలో లోకేశ్ గారు అవినీతికి పాల్పడ్డారని గగ్గోలుపెట్టారు. ఎంతఅవినీతి జరిగింది అంటే ఇంతవరకు దానికి సమాధానంలేదు.
ఊరికే చేతిలో అధికారం ఉందికదా అని అధికారులను అర్థరాత్రి ఇళ్లపైకి పంపడం, అరెస్ట్ లు చేయడం, మీడియాలో హాడావుడిచేయడం తప్ప,వైసీపీప్రభుత్వం రెండున్నరసంవత్సరాల్లో ఎలాంటి అవినీతిని నిరూపించలేకపోయింది. టీడీపీనేతలను తప్పుడుకేసులు, అవినీతి ఆరో పణలతో వేధించే సమయంలో 1శాతం సమయాన్నిఅయినా రాష్ట్రానికి ఆదాయం తీసుకురా వడంపై, ఈప్రభుత్వం పెట్టిఉంటే, ఇప్పుడు ఏపీపై రూ.3లక్షలకోట్ల అప్పులభారం పడేదికాదు .
ఆఖరికి ముఖ్యమంత్రికూడా తనఆలోచన, ధ్యాసంతా కూడా ప్రతిపక్షంపై, ప్రతిపక్షనేతను వేధించడంపైనేఉంది. ఆఖరికి మధ్యాహ్నభోజనం పథకానికి కేంద్రంనిధులిచ్చినా ప్రభుత్వ వాటాకింద

నిధులుచెల్లించలేని దుస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారింది.ఏపీస్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ని రాష్ట్రంలో అమలుచేయడానికి, గతంలోచంద్రబాబు నాయుడి ప్రభుత్వం, రాష్ట్రవాటాగా రూ.371కోట్లు ఖర్చుచేస్తే దానిలో రూ.241కోట్ల అవినీతి జరిగిందని ఈప్రభుత్వం దుష్ప్రచారం మొదలెట్టింది.
2019లో చంద్ర బాబునాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన డేటా మొత్తం ఆర్ వోసీలో ఫైల్ చేసి, అంతా సక్రమంగానే ఉందని కేంద్రప్రభుత్వ మే నివేదికఇస్తే, ఈప్రభుత్వానికి మాత్రం రూ.241కోట్ల అవినీతి కనిపించిందా? ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్, కొందరు అధికారులు ఉంటారు. దాన్ని ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది.
ఆ సంస్థకుసంబంధించిన నిర్ణయాలు ఏవీతీసుకోవాలన్నా ఛైర్మన్, మిగతాసభ్యులు అందరూకలిసి నిర్ణయం తీసుకుంటారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్లో ఏ సమయంలో అయితే ఈప్రభుత్వం అవినీతి జరిగిందని చెబుతోందో, అప్పుడు దానికి ఛైర్మన్ గా ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి అనే ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, డైరెక్టర్లు చెప్పినా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సదరు ప్రేమచంద్రారెడ్డి నిర్ణయమే ఫైనల్. ఒకవేళ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో నిజంగా అవినీతి జరిగితే, ముందు అరెస్ట్ చేయాల్సింది, విచారించాల్సింది ప్రేమచంద్రారెడ్డిని.
ఆయన్ని వదిలేసి రిటైరైన వ్యక్తిని, వయోవృద్ధుడిని, కేవలం స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్లో సభ్యుడిగా ఉన్న లక్ష్మీనారాయణను అరెస్ట్ చేస్తారా? అదికూడా అర్థరాత్రి వెళ్లి ఆయన ఇంటిపై పడతారా? నిజంగా స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్లో లక్ష్మీనారాయణ అవినీతికి పాల్పడి ఉంటే, ఈప్రభుత్వం అరెస్ట్ చేసేవరకు చూస్తూ ఊరుకుంటారా? కావాలనే జరగని అవినీతి జరిగినట్టు, దాన్ని లక్ష్మీనారాయణకు, ఆయనద్వారా చంద్రబాబానాయుడి కి ఆపాదించే దుష్టప్రయత్నం ఈప్రభుత్వం చేస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఎండీ, ఇతర సభ్యులుంటే, ఒక్కడే సభ్యుడు అవినీతికి పాల్పడతాడా? అది జరిగే పనేనా? లక్ష్మీనారాయ ణ గారు అవినీతికి పాల్పడ్డారని, గతప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, ఇప్పుడు సదరుసంస్థలో పనిచేస్తున్న వ్యక్తి 9వతేదీన మధ్యాహ్నం 12గంటలకు ఫిర్యాదుచేస్తే, దాన్ని పట్టుకొని అదేరోజు అర్థరాత్రి లక్ష్మీనారాయణ ఇంటికి వెళతారా? ఫిర్యాదు 12గంటలకు చేస్తే, అప్పుడే విచారణ రిపోర్ట్ కూడా తయారుచేశారు… అదికూడా 9వ తేదీ మధ్యాహ్నానికే సిద్ధంచేశారు. ఇదంతా చూస్తుంటేనే అర్థమవుతోందికదా.. ఈప్రభు త్వం ఎలా వ్యవహరిస్తోందో? ఏ వ్యక్తి కైనా ఏడుసంవత్సరాలలోపు శిక్షలు పడే కేసుల్లో ముం దుగా నోటీసులివ్వాలని, తరువాతే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టుచెప్పినా ఈప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది.
ఒకపక్కన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులుపెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాకపోయినా, రాష్ట్రం అప్పులపాలవుతున్నా ఈ ముఖ్యమంత్రి కక్షసాధింపులుఆగడంలేదు. నిజంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో రూ.241కోట్ల అవినీతి జరిగితే, దానికిసంబంధిం చిన వివరాలు ఎంతకచ్చితంగా ఉండాలి. లక్ష్మీనారాయణ గారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా ఉంటే, సీఐడీ తయారుచేసిన ఛార్జ్ షీట్లో ఏపీపీఎస్ డీసీ డైరెక్టర్ అని ఏదేదోరాశారు. ఇంకో అంశం ఏమిటంటే ఈఅంశంలోఎక్కడా సీఐడీ అధికారులు లీగల్ ప్రొసీజర్స్ ఫాలోకాలేదు. ఎఫ్ఐఆర్ లు, ఛార్జీషీట్లలోఉండే సమాచారంసరిగా ఉండదు.
కోర్టుల్లోనేమో ప్రభుత్వ న్యాయవాదులు అడ్డగోలుగా టీడీపీవారు తప్పుచేశారంటూ వాదిస్తారు..ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో చీవాట్లుపడతాయి… దాంతో వెంటనే చంద్రబాబు కోర్టులన మేనేజ్ చేస్తున్నాడంటూ దుష్ప్రచారంచేయడం. చట్టప్రకారం కోర్టులు వ్యవహరిస్తుంటే, ప్రజాకోర్టులో న్యాయస్థానాలను, న్యాయమూర్తులనుదోషులుగా చిత్రీకరిస్తు న్నారు. కావాలనే ప్రజలను దారిమళ్లించడానికే జగన్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది. మహిళా కార్యదర్శులను మహిళాకానిస్టేబుళ్లుగా నియమిస్తూ, అది కోర్టుల్లో నిలబడదని తెలిసి, ప్రభుత్వం వెంటనే దానికిసంబంధించిన జీవోని వెనక్కు తీసుకుంది.
అదే జీవోపై ఎవరైనా కోర్టుకి వెళ్లుంటే, కచ్చితంగా ఈప్రభుత్వం చంద్రబాబే చేయించాడని దుష్ప్రచారంచేసి ఉండేది. ఇలాంటి నిర్ణయాలు ఈప్రభుత్వానికి రాజకీయంగా కలిసివస్తాయేమో గానీ, రాష్ట్రానికి ఎంతచెడ్డపేరు రావాలో అంతవస్తుంది. దాన్ని పోగోట్టడం ఎవరితరంకాదు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు పిచ్చినిర్ణయాలు తీసుకొని, అందినకాడికి దోపిడీ చేసి వెళ్లిపోతే రాష్ట్రానికి దిక్కెవరు? ముఖ్యమంత్రికి ఏమాత్రం రాష్ట్రంపై ప్రేమఉన్నా, ఆయన తక్షణమే తనపిచ్చి, తలతిక్క నిర్ణయాలకు స్వస్తి పలకాలి. తానుచేసేవాటితో టీడీపీ వారు భయపడతారు… రాష్ట్రంలో టీడీపీఉండదు.. తరవాత తానేఏలుకోవచ్చని ఈ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు.
ఈప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో నేరుగా యుద్ధంచేయడం టీడీపీకి లెక్క కాదు, ప్రభుత్వం బరితెగించి రోడ్డెక్కిందని, ప్రతిపక్షంకూడా ఆపనిచేస్తే, రాష్ట్రభవిష్యత్, ఏపీ రూపురేఖలు నామరూపాల్లేకుండా పోతాయి. అంతదూరం ఆలోచించే టీడీపీఅధినేత, కార్య కర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏపీనే నంబర్ 1 ఉండాలన్న చంద్రబా బు నాయుడి గారి లక్ష్యంకోసమే టీడీపీ పనిచేస్తోంది. ఆ విషయం గుర్తుంచుకోవాలని అధికార పార్టీకి సూచిస్తున్నా. ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి తక్షణమే అరాచకచర్యలకు స్వస్తిచెప్పకపో తే, వచ్చేఎన్నికల్లో 151 కాదు.. కేవలం 15స్థానాలకేవైసీపీపరిమితమవడం ఖాయం.

LEAVE A RESPONSE