తెలిసి తెలియన వయసు .వాళ్లిద్దరు మైనర్లే … అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడారు . ఆ తర్వాత మరింత దగ్గర అయ్యారు. దాని ఫలితమే మైనర్ బాలిక గర్భం దాల్చింది .వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణిగా తేలింది . ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళ్తే ..
బోయపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు . తొమ్మిదో తరగతి వరకు చదివిన బాలిక .. ఇంటి దగ్గరే ఉంటోంది . అయితే అదే గ్రామానికి చెందిన బాలుడు కూడా ఇంటర్ పూర్తి చేశాడు . ఇంటి వద్దే ఉంటున్నాడు . ఈ క్రమంలోనే బాలిక , బాలుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు . ఆ తర్వాత మరింత దగ్గరయ్యారు . కొన్ని నెలల తర్వాత బాలిక అనారోగ్యం బారిన పడింది .
తల్లిదండ్రులు బాలికను 30 రోజుల కిందట నర్సీపట్నం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు . కాగా వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణీ అని తేలింది.దీంతో మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు . బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకి తరలించినట్లు పోలీసులు తెలిపారు .